Adipurush | ఆదిపురుష్‌ను.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజ‌న్స్‌

టికెట్ తగ్గింపు ట్వీట్‌పై భారీ సెటైర్లు విధాత‌: ప్రభాస్ సినిమా టిక్కెట్ ధరలను మరింత తగ్గించినందుకు నెటిజన్లు ఆదిపురుష్ (Adipurush) మేకర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు: 'ఉచితంగా కూడా చూడము' అంటూ ఆట ప‌ట్టిస్తున్నారు. ఆదిపురుష్ పై విమ‌ర్శ‌లు వెల్లువ నేప‌థ్యంలో సినిమా హాల్లు నిండ‌క‌పోవ‌డంతో ఈ సినిమా నిర్మాత‌లు టికెట్ ధరలను రూ. 250 నుంచి రూ.112కి తగ్గించారు. అదే విష‌యాన్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్లు చేస్తున్నారు. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం […]

Adipurush | ఆదిపురుష్‌ను.. ఓ ఆట ఆడుకుంటున్న నెటిజ‌న్స్‌
  • టికెట్ తగ్గింపు ట్వీట్‌పై భారీ సెటైర్లు

విధాత‌: ప్రభాస్ సినిమా టిక్కెట్ ధరలను మరింత తగ్గించినందుకు నెటిజన్లు ఆదిపురుష్ (Adipurush) మేకర్స్‌ను ట్రోల్ చేస్తున్నారు: ‘ఉచితంగా కూడా చూడము’ అంటూ ఆట ప‌ట్టిస్తున్నారు. ఆదిపురుష్ పై విమ‌ర్శ‌లు వెల్లువ నేప‌థ్యంలో సినిమా హాల్లు నిండ‌క‌పోవ‌డంతో ఈ సినిమా నిర్మాత‌లు టికెట్ ధరలను రూ. 250 నుంచి రూ.112కి తగ్గించారు.

అదే విష‌యాన్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్లు ఇష్ట‌మొచ్చిన‌ట్లు కామెంట్లు చేస్తున్నారు. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం కాదు క‌దా, ఫ్రీగా చూపించిన చూసే ప‌రిస్థితి లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

రాఘవ (రాముడు)గా ప్రభాస్, జానకి (సీత)గా కృతి సనన్, లంకేష్ (రావణ)గా సైఫ్ అలీఖాన్ నటించిన ఆదిపురుష్ జూన్ 16న థియేటర్లలో విడుదలైంది. సంస్కృత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కింది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా బాక్సాఫీస్ వద్ద తొలి వారంలోనే 300 కోట్ల గ్రాస్‌ను చేరుకుంది.