TDP సోషల్ మీడియాకు కొత్త బాస్!
విధాత: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నిరకాలుగా తన సేనలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ వైసీపీలు ఒక్కో విభాగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాయి. మొన్ననే తన అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించిన వైసిపికి పోటీగా టీడీపీ కూడా తాజాగా సోషల్ మీడియాకు కొత్త బాస్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉంటూ వైసిపిని, ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇరకాటంలో పెడుతూ వస్తోంది. ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసి ప్రభుత్వాన్ని, వైసిపిని మరింత […]

విధాత: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్నిరకాలుగా తన సేనలను సిద్ధం చేసుకుంటున్న టీడీపీ వైసీపీలు ఒక్కో విభాగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాయి. మొన్ననే తన అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించిన వైసిపికి పోటీగా టీడీపీ కూడా తాజాగా సోషల్ మీడియాకు కొత్త బాస్‌ను నియమించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే టిడిపి సోషల్ మీడియా బాగా యాక్టివ్ గా ఉంటూ వైసిపిని, ప్రభుత్వాన్ని అన్నిరకాలుగా ఇరకాటంలో పెడుతూ వస్తోంది. ఇప్పుడు దాన్ని మరింత బలోపేతం చేసి ప్రభుత్వాన్ని, వైసిపిని మరింత ఇబ్బంది పెట్టేందుకు శక్తియుక్తులను సమీకరిస్తోంది.
పార్టీ అధికార ప్రతినిధి జీవి రెడ్డిని తాజాగా టీడీపీ సోషల్ మీడియా నూతన సారథిగా నియమితులైనట్టు సమాచారం. ప్రస్తుతం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ టీడీపీ సోషల్ మీడియా ప్రధాన బాధ్యతలు చూస్తూ ఆ విభాగాన్ని యాక్టివ్ చేస్తూ వస్తున్నారు.
అయితే దానికి మరింత జవసత్వాలు ఇచ్చే క్రమంలో సీఏ, లా వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న జీవి రెడ్డిని సోషల్ మీడియాకు సారధిగా నియమిస్తున్నట్లు తెలిసింది. జీవీరెడ్డికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, న్యాయపరమైన అంశాలపై లోతైన అవగాహన వుంది. ఏ విషయాన్నైనా సులువుగా విశ్లేషించగలిగే సామర్థ్యం జీవీరెడ్డికి ఉంది. ఇక వైసిపి సోషల్ మీడియాకు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి సారథ్యం వహిస్తున్నారు.