Warangal | మణిపూర్ హంతక దాడులకు మోడీదే బాధ్యత
Warangal న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, దళిత సంఘాల నిరసన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ సృష్టికర్త మోడీ ప్రభుత్వమేనని సీపీఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం మణిపూర్ మైదాన ప్రాంతానికి చెందిన మైతి వర్గం వారు ఆదివాసీ కుకీ, నాగ ప్రజలపై జరుపుతున్న దాడులను నిరసిస్తూ వరంగల్లో నల్ల జెండాలతో ధర్నా నిర్వహించారు. న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు, […]

Warangal
- న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్, దళిత సంఘాల నిరసన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ సృష్టికర్త మోడీ ప్రభుత్వమేనని సీపీఐ (ఎంఎల్ ) న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం మణిపూర్ మైదాన ప్రాంతానికి చెందిన మైతి వర్గం వారు ఆదివాసీ కుకీ, నాగ ప్రజలపై జరుపుతున్న దాడులను నిరసిస్తూ వరంగల్లో నల్ల జెండాలతో ధర్నా నిర్వహించారు.
న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు, ఆరెల్లి కృష్ణ, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గంగుల దయాకర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి ప్రతాపరెడ్డి, పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడారు. కుకి తెగకు చెందిన మహిళలను వివస్త్రలను చేసి అత్యాచారం హత్య చేయడం ఈ దేశంలో ఆదివాసీ ప్రజలకు ఎంతటి భద్రత ఉందో తెలియజేస్తున్నదన్నారు. ఈ ఘటనపై ఆదివాసి మహిళగా రాష్ట్రపతి స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
మణిపూర్ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద, సహజ సంపదలను మోడీ బడా దోపిడిదారైన కార్పొరేట్ ఆదానికి అప్పగించిందని, అందుకే అడవుల నుండి నాగ కుకీజాతి ఆదివాసీ ప్రజలను వెళ్లగొట్టే పనిలో మైదాన ప్రాంత మైతి వర్గానికి చెందిన వారిని ఎస్టీ జాబితాలో చేర్చి , హత్యలు దాడులు చేయిస్తున్నదని మండిపడ్డారు.
భారత రాజ్యాంగంలోని ఐదు ఆరు షెడ్యూల్లో అటవీ ప్రాంత ఆదివాసి ప్రజల హక్కులు ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వము వీటిని ఖాతర్ చేయకుండా దేశంలోని అటవీ ప్రాంతాలు అన్నింటిని సామ్రాజ్యవాదదోపిడీకి అదాని, అంబానీలకు కట్టబెడుతున్నదన్నారు. అడవి ప్రాంతాల అభివృద్ధి పేరుతో గిరిజనులను గెంటివేసి చేసే ఈ విధ్వంసాన్ని ఖండించాలని మణిపూర్ ఆదివాసీ జాతులకు అండగా ఉండాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులను వారు కోరారు.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు ఐ ఎఫ్ టి యు నాయకులు గన్నారం రాజేందర్ ఎర్రజబాబు జయబాబు పి వై ఎల్ నాయకులు సుమన్ హరిబాబు షేర్ మధు ఎండి అక్బర్ లతోపాటు ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ మోడీ దిష్టిబొమ్మ దహనం
మణిపూర్ లోని మైనార్టీ వర్గమైన కుకీ వర్గానికి చెందిన గిరిజన మహిళలపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. ఏఐసీసీ మహిళ అధ్యక్షురాలు నెట్ట డిసౌజ, టీ పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతా రావు ఆదేశం మేరకు శనివారం హనుమకొండలో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మణిపూర్ ఘటనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని, ప్రధానమంత్రి పదవికి మోడీ వెంటనే రాజీనామా చేయాలని బంక సరళ సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జె. లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగపురి లలిత, హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బొంత సుజాత, జిల్లా,మండల మహిళ నేతలు యామిని మోటే, భోగం కమల, రజిత విజయ , పద్మ,కొమురమ్మ ,రవళి ,ధరణి ,సరస్వతి, రజిత ,స్వరూప తో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దళితసంఘాల నిరసన
మణిపూర్ రాష్ట్రంలో హత్యలకు కారణమైన ప్రభుత్వాన్ని రద్దు చేయాలని దళిత, ప్రజాసంఘాల అద్వర్యంలో శనివారం నిరసన, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శిచుంచు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.