Nikki Haley | నిక్కీ హేలికి తొలి విజయం.. కొలంబియా ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి భావిస్తున్న భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలి రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తొలి విజయాన్ని నమోదు చేశారు

Nikki Haley | నిక్కీ హేలికి తొలి విజయం.. కొలంబియా ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు..

Nikki Haley | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి భావిస్తున్న భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలి రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో తొలి విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం కొలంబియాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. ఇక మంగళవారం జరిగే ప్రైమరీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొన్నది. ఈ ప్రైమరీలో నిక్కీ హేలికి చాలామంది ప్రతినిధులు మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు.అమెరికా చరిత్రలో రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన తొలి మహిళగా నిక్కీ హేలీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విజయం సాధిస్తూ వచ్చారు.

అయితే, తొలిసారిగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం 16 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగనుండగా.. ట్రంప్, నిక్కీ హేలీల మధ్య పోటీ ఎలా ఉంటుందో మంగళవారం స్పష్టమయ్యే అవకాశం ఉంది. వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ, నిక్కీ హేలీ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగడానికి నిరాకరించారు. తొలి విజయం నమోదు చేసిన నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్నారు. కొలంబియాలో మొత్తం 19 మంది ప్రతినిధుల మద్దతు నిక్కీ హేలీకి లభించింది. మరో వైపు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినా ప్రైమరీల్లో నిక్కీ హేలీపై గెలుపొందారు.

ఇదిలా ఉండగా.. వాషింగ్టన్‌ డీసీలో ఉ‍న్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీ 63 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 33.2శాతం ఓట్లకే పరిమితం కాగా.. వాషింగ్టన్‌ డీసీలో 2020 ఎన్నికల సమయంలో డొమోక్రటిక్‌ అభ్యర్థి జోబైడెన్‌ 92 శాతం ఓట్లు సాధించారు. రిపబ్లికన్‌ పార్టీకి ఎక్కువ శాతం మెజర్టీ రాదనే వాదనలుండగా.. భిన్నంగా నిక్కీ హేలీ 62శాతం ఓట్లు సాధించడం గమనార్హం.