Nithin | రాజ‌కీయాల్లోకి టాలీవుడ్ హీరో.. ఎమ్మెల్యేగా పోటీ..?

Nithin | రాజ‌కీయాల‌కి సినీ గ్లామ‌ర్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి ఎన్నిక‌ల‌లో కూడా కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఆయా పార్టీల‌లో చేర‌డం, ఆ పార్టీల‌కి ప్ర‌చారం చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పుడు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు రాజకీయారంగేట్రం చేయ‌బోతున్న‌ట్టు వినికిడి. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ నితిన్ రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. నిజామాబాద్ కు చెందిన నితిన్ కాంగ్రెస్‌లో జాయిన్ అయి రూరల్ నియోజకవర్గం నుంచి […]

  • By: sn    latest    Jul 07, 2023 2:16 AM IST
Nithin | రాజ‌కీయాల్లోకి టాలీవుడ్ హీరో.. ఎమ్మెల్యేగా పోటీ..?

Nithin |

రాజ‌కీయాల‌కి సినీ గ్లామ‌ర్ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి ఎన్నిక‌ల‌లో కూడా కొంద‌రు సినీ ప్ర‌ముఖులు ఆయా పార్టీల‌లో చేర‌డం, ఆ పార్టీల‌కి ప్ర‌చారం చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పుడు కొంద‌రు సినీ ప్ర‌ముఖులు రాజకీయారంగేట్రం చేయ‌బోతున్న‌ట్టు వినికిడి.

ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ నితిన్ రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. నిజామాబాద్ కు చెందిన నితిన్ కాంగ్రెస్‌లో జాయిన్ అయి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ ఆ మధ్య హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నితిన్‌ ప్రత్యేకంగా కలిసిన నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం నిర్వహిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇదిలాఉండగా నితిన్ మేనమామ నగేష్ రెడ్డి ఎప్ప‌టి నుండో రాజకీయాల్లో ఉన్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప‌దేళ్ల‌కి పైగా ప‌ని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ రూరల్ నియోజక వర్గం సీటు ఆశిస్తుండడంతో ఆయనకు టికెట్‌ ఇప్పించేందుకు నితిన్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడే త‌ప్ప ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం లేద‌ని మ‌రి కొంద‌రు అంటున్నారు. ఇంకొంద‌రు నితిన్‌ని ఎమ్మెల్యేగా చూడాల‌ని ఉంద‌ని చెప్పుకొస్తున్నారు.

నితిన్ ఇటీవ‌ల స‌రైన స‌క్సెస్‌లు లేవు. నితిన్ హిట్ చూసి చాలా రోజులే అవుతుంది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు వెంకీ కుడుములతో ఒక మూవీ ప్రకటించారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ కాగా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు నితిన్. పెళ్లైన త‌ర్వాత సినిమాల స్పీడ్ త‌గ్గించిన నితిన్‌ త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నాడంటూ కూడా ఇటీవ‌ల చాలా ప్ర‌చారాలు సాగాయి. కాని అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.