Warangal: మా మధ్య విభేదాలు లేవు.. ఎవరైనా వస్తే నలిగిపోతారు: మంత్రి సత్యవతి రాథోడ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అడ్రస్ లేని వాడు వచ్చి పోటీ చేస్తే ముప్పై నలబై వేల ఓట్ల మెజారిటీతో గెలవాల్సి ఉండే కానీ మన అలసత్వం మూలంగానే మెజారిటీ తగ్గింది, ఎంపీ కవితకు కూడా అనుకున్న మెజారిటీ రాలేదు.. ఈసారి ఆ పరిస్థితి పోవాలి.. డోర్నకల్‌లో భారీమెజారిటీ రావాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మరిపెడలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్‌ ఆత్మీయసమ్మేళానికి మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. […]

Warangal: మా మధ్య విభేదాలు లేవు.. ఎవరైనా వస్తే నలిగిపోతారు: మంత్రి సత్యవతి రాథోడ్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అడ్రస్ లేని వాడు వచ్చి పోటీ చేస్తే ముప్పై నలబై వేల ఓట్ల మెజారిటీతో గెలవాల్సి ఉండే కానీ మన అలసత్వం మూలంగానే మెజారిటీ తగ్గింది, ఎంపీ కవితకు కూడా అనుకున్న మెజారిటీ రాలేదు.. ఈసారి ఆ పరిస్థితి పోవాలి.. డోర్నకల్‌లో భారీమెజారిటీ రావాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

మరిపెడలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్‌ ఆత్మీయసమ్మేళానికి మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మా.. మధ‌ గొడవలు లేవు, డోర్నకల్ నియోజకవర్గంలో విబేధాలు లేవు, ఏదో లబ్ధి పొందుదామని ఎవరైనా మా మధ్య‌కు వస్తే నలిగి పోతారని హెచ్చరించారు.

రెడ్యానాయక్ చాలా పట్టుదల ఉన్న నాయకుడు.. అనుకుంటే సాధించే దాకా వదలడని అన్నారు. దారినపోయే దానయ్యలు చేసే విమర్శలు తిప్పికొట్టాలి.., ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాలు ఇవ్వడానికి వస్తారు.. అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

మనస్పర్థలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి: మంత్రి దయాకర్ రావు

చిన్న.. చిన్న మనస్పర్థలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు సూచించారు. మీ నియోజకవర్గానికి మంచి నాయకులు ఉన్నారని చెప్పారు.
సీనియర్లకు నామినేటెడ్ పోస్ట్ ల కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

దేశానికి తెలంగాణ మోడల్‌: మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్

భారతదేశాన్ని తెలంగాణ మోడల్‌గా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిడికిలి బిగించారని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అన్నారు. దేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. బిజేపికి ఎజెండా లేదు.. మతవాదాన్ని రెచ్చగొట్టి మనుగడ సాగించాలనుకుంటున్నారని విమర్శించారు.

మరిపెడ అంటే రెడ్యానాయక్: ఎంపీ క‌విత‌

మరిపెడ అంటే రెడ్యానాయక్ కు గుండెకాయ అంటూ మానుకోట ఎంపీ, బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మీ దగ్గర ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అవుతుంది, మిమ్మల్ని చూసి మిగతా మండలాలు మరింత బాగా కార్యక్రమాలు చేస్తాయన్నారు.

మీ ఓటుకు ప్రతినిధిగా నేనున్నా: ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌

మీరందరూ ఉండబట్టే ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నాన‌ని ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీ..మేలు నేను మరిచిపోనన్నారు. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన రెడ్యానాయక్ ను సేవకునిగా మీరు గుర్తించారన్నారు. నా.. బిడ్డ కవితకు కూడా మీరు ప్రజా సేవ చేసే భాగ్యం కల్పించారని గుర్తు చేశారు.

ఈ వేదిక నుంచి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ వినమ్రంగా ప్రకటించారు. మాజీ ఓడిసియంయస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మెజారిటీ పదవులు గిరిజనులకే ఉన్నాయి కాబట్టి నామినేటెడ్ పదవులు గిరిజనేతరులకు ఇవ్వాలన్నారు.

డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్‌కు తప్ప మరొకరికి ఓటు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్‌ నాయకులు డిఎస్ రవిచంద్ర అన్నారు. యువతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి, డోర్నకల్ నియోజకవర్గంలో యువతకు ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.