అమెరికాలో కూలుతున్న భారతీయుల ఆశల సౌధాలు..

విధాత: భవిష్యత్తుపై కోటి ఆశలతో సుదూర దేశాలకు తరలివెళ్లిన భారతీయుల కలలు కల్లలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా బాట పట్టిన వారి ఆశలు అడియాశలవుతున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ లేఆఫ్‌ను ప్రకటిస్తుండటంతో గత కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. ముఖ్యంగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఉద్యోగుల్లో కోతను విధిస్తున్నాయి. ఆయా కంపెనీలు నిర్వహనా భారాన్ని తగ్గించుకొనే పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను […]

  • By: krs    latest    Jan 26, 2023 11:40 AM IST
అమెరికాలో కూలుతున్న భారతీయుల ఆశల సౌధాలు..

విధాత: భవిష్యత్తుపై కోటి ఆశలతో సుదూర దేశాలకు తరలివెళ్లిన భారతీయుల కలలు కల్లలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా బాట పట్టిన వారి ఆశలు అడియాశలవుతున్నాయి. మున్నెన్నడూ లేని విధంగా అమెరికాలోని దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ లేఆఫ్‌ను ప్రకటిస్తుండటంతో గత కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఇంటిబాట పట్టారు. ముఖ్యంగా అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు ఉద్యోగుల్లో కోతను విధిస్తున్నాయి. ఆయా కంపెనీలు నిర్వహనా భారాన్ని తగ్గించుకొనే పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

అమెరికాలోని దిగ్గజ కంపెనీల్లో గణనీయ సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు పొందారు. ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌పై బంగారు కలలు కంటూ అమెరికాలో అడుగు పెట్టిన వారు ఉన్న పలాన ఉద్యోగాలు పోయి రోడ్డున పడితే వారి భవితవ్యం అగమ్యగోచరం కానున్నది.

ఈ నేపథ్యంలో ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) సంస్థ భారతీయుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగాలు కోల్పోతున్న వారి గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పట్టించుకోవాలని విజ్ఞప్తి చేసింది.

అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం ప్రెస్‌ సెక్రటరీ కరీన్‌ జీన్‌ పియరే మాట్లాడుతూ.. ఉద్యోగాలు కోల్పోతున్న వారి పట్ల బైడెన్‌ ఆలోచిస్తున్నారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకొంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలియజేసింది. ఆ క్రమంలోనే హెచ్‌-1బి వీసాలు పొందిన భారతీయుల భవితవ్యం గురించి బైడెన్‌ తప్పక పట్టించుకొంటారని, సానుకూల పరిస్థితుల కోసం ఆలోచిస్తామని తెలుపటం హర్షణీయం.