Nomula Bhagat | నందికొండలో ‘మన వార్డుకు మన ఎమ్మెల్యే’

Nomula Bhagat విధాత: నల్గొండ జిల్లా… నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీలో "మన వార్డుకి మన ఎమ్మెల్యే" కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 60 ఏళ్ళ క్రితం నాగార్జునసాగర్ కు బ్రతుకుతెరువుకు ఇక్కడికి వచ్చిన పట్టణ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చారన్నారు. నాగార్జునసాగర్ లో SDF నిదుల నుండి 25 కోట్ల రూపాయలను వెచ్చించి మంచినీటి సమస్యతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ కే […]

Nomula Bhagat | నందికొండలో ‘మన వార్డుకు మన ఎమ్మెల్యే’

Nomula Bhagat

విధాత: నల్గొండ జిల్లా… నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీలో “మన వార్డుకి మన ఎమ్మెల్యే” కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

60 ఏళ్ళ క్రితం నాగార్జునసాగర్ కు బ్రతుకుతెరువుకు ఇక్కడికి వచ్చిన పట్టణ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చారన్నారు. నాగార్జునసాగర్ లో SDF నిదుల నుండి 25 కోట్ల రూపాయలను వెచ్చించి మంచినీటి సమస్యతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధి చేసిన ఘనత కెసిఆర్ కే సాధ్యమైందన్నారు. నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అభివృద్ధి చేసి చూపిన ఘనత కేసిఆర్ దే అన్నారు.

గత పాలకులు అభివృద్ధి చేయడంలో విప్లమయ్యారన్నారు. ఇప్పుడు సిసి రోడ్లు నిర్మించామని, పూర్తిస్థాయిలో డ్రైనేజీ వ్యవస్థను కూడా అతి త్వరలో నిర్మిస్తామన్నారు. మున్సిపాలిటీలో పట్టాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి జియో టాకింగ్ విధానంతో ఇంటి నెంబర్లను కేటాయిస్తారు. ఇంటి నెంబర్లు రానివారు కొంత టైం వేచి ఉండాలని సూచించారు. ఏండ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు కల్పించిన సీఎం కేసీఆర్ గారికి మున్సిపాలిటీ స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సాగర్ కమలా నెహ్రు ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే నోముల

నాగార్జునసాగర్ కమల నెహ్రూ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్పిటల్లో బయోమెట్రిక్, ఓపి సేవలు, రికార్డులు పరిశీలించి సమీక్ష జరిపారు. సాగర్ కమలా నెహ్రు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సౌకర్యాల గురించి ఆరా తీశారు.

వైద్యులు ఏ సమయంలో అయినా అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలు చాలా మెరుగు పడ్డాయని , సాగర్ లో గతంతో పోలిస్తే ఓపి సేవలు పెరిగాయని అన్నారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కమలా నెహ్రు ఏరియా హాస్పిటల్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుతో డయాలసిస్ రోగుల కష్టాలు కూడా తీరాయని ఎమ్మెల్యే అన్నారు.

కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మున్సిపల్ చైర్మన్ అనూష శరత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ జువాజీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, మోదుకూరి రాంబాబు, వైస్ చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ, కౌన్సిలర్లు రమావత్ మంత నాయక్, రమేష్ జి, ఈర్ల రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి, టౌన్ ప్రధాన కార్యదర్శి భూష రాజుల కృష్ణ, బీసీ సెల్ నాయకులు ఊర శీను, ఎస్టీ సెల్ నాయకులు చంద్రమౌళి, కార్మిక విభాగ నాయకులు కొండల్, మహిళా నాయకురాలు జానకి రెడ్డి, మాధవి, విజయ్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు అర్షద్, బిఆర్ఎస్ యూత్ నాయకులు హర్ష, సురేష్, సందీప్,అర్జున్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చంద్రయ్య, కేరళ సురేష్, నక్క కిషోర్, బండిషన్న, కేశవులు, ప్రదీప్, ఎమ్మార్వో సైదులు, మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి, ఆర్ఐ, వివిధ శాఖల అధికారులు, నాయకులు, వైద్యాధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.