కెనడా గగనతలంలో అనుమానస్పద వస్తువు.. కూల్చివేసిన అమెరికా
వాషింగ్టన్ : కెనడా గగనతలంలో ఎగురుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా పేల్చి వేసింది. కెనడియన్ గగనతలంలో మానవరహిత ఎత్తులో ఎగురుతున్న వస్తువు విషయంపై ఈ విషయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ ద్వారా చర్చించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఆ తర్వాత అమెరికా, కెనడా సేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అమెరికన్ ఫైటర్ జెట్‌లు అనుమానాస్పద వైమానిక వస్తువును కూల్చినట్లు తెలిపింది. 40వేల అడుగుల ఎత్తులో వస్తువు ఉండగా.. […]

వాషింగ్టన్ : కెనడా గగనతలంలో ఎగురుతున్న అనుమానాస్పద వస్తువును అమెరికా పేల్చి వేసింది. కెనడియన్ గగనతలంలో మానవరహిత ఎత్తులో ఎగురుతున్న వస్తువు విషయంపై ఈ విషయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ ద్వారా చర్చించినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఆ తర్వాత అమెరికా, కెనడా సేనలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో అమెరికన్ ఫైటర్ జెట్‌లు అనుమానాస్పద వైమానిక వస్తువును కూల్చినట్లు తెలిపింది. 40వేల అడుగుల ఎత్తులో వస్తువు ఉండగా.. కూల్చివేసినట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ బ్రిగేడియర్ జనరల్ పాట్ డైరట్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా ఏరోస్పేస్ ఢిపెన్స్ కమాండ్ శుక్రవారం అలాస్కా మీదుగా వస్తువును గుర్తించింది.
గత 24 గంటల్లో వస్తువును నిశితంగా ట్రాక్ చేస్తూ పర్యవేక్షించిందని వైట్‌హౌస్ పేర్కొంది. ఆ తర్వాత జాతీయ భద్రతా బృందం తర్వాత ప్రెసిడెంట్‌కు సమాచారం అందించినట్లు పేర్కొంది. అధ్యక్షుడు బిడెన్, ప్రధాన మంత్రి ట్రూడో అనుమతి తర్వాత అమెరికన్ ఫైటర్ ప్లేన్ F-22 కెనడియన్ భూభాగంలో కెనడియన్ సైన్యం సమన్వయంతో అనుమానిత వస్తువును కూల్చివేసినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఆ వస్తువు శకలాలను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ఉత్తర కమాండ్ ప్రక్రియ మొదలుపెట్టిందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ వెల్లడించారు. ఇటీవల చైనాకు చెందిన భారీ నిఘా బెలూన్ అగ్రరాజ్యం కూల్చివేసిన విషయం విధితమే. ఆ బెలూన్‌లో కమ్యూనికేషన్ సంకేతాలను సేకరించగలిగే పరికరాలు ఉన్నాయని అమెరికా పేర్కొంది.