నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

Amit Shah | కేంద్ర మంత్రి అమిత్‌ షా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ప్రొబేషనరీ ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరవనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో పరేడ్‌ జరుగనున్నది. కాన్వొకేషన్ పరేడ్‌లో 195 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొననున్నారు. ఇందులో 29 మంది ఆఫీసర్ ట్రైనీలు ఇతర దేశాలకు చెందినవారని ఎస్‌వీపీఎన్‌పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఫేజ్-1 బేసిక్ కోర్సులో టాపర్‌గా నిలిచిన కేరళ […]

నేడు హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

Amit Shah | కేంద్ర మంత్రి అమిత్‌ షా శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) ప్రొబేషనరీ ఆఫీసర్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హాజరవనున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో పరేడ్‌ జరుగనున్నది. కాన్వొకేషన్ పరేడ్‌లో 195 మంది ఆఫీసర్ ట్రైనీలు పాల్గొననున్నారు. ఇందులో 29 మంది ఆఫీసర్ ట్రైనీలు ఇతర దేశాలకు చెందినవారని ఎస్‌వీపీఎన్‌పీఏ డైరెక్టర్ ఏఎస్ రాజన్ తెలిపారు. ఫేజ్-1 బేసిక్ కోర్సులో టాపర్‌గా నిలిచిన కేరళ కేడర్‌కు చెందిన షహన్‌షా కేఎస్ పరేడ్‌కు నాయకత్వం వహించనున్నారు.

సెరిమోనియల్ మార్చ్ పాస్ట్ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి ఐపీఎస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 166 మంది ఐపీఎస్ ప్రొబేషనర్లలో 114 మంది ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన వారేనని తెలిపారు. 22 మంది ఆర్ట్స్ నుంచి, 17 మందికి సైన్స్ నేపథ్యం ఉంది. దాదాపు 95 మంది ప్రొబేషనరీ ఐపీఎస్‌లకు గతంలోనూ పోలీసుశాఖలో పని చేసిన అనుభవం ఉన్నది. సైబర్ సెక్యూరిటీపై తలెత్తుతున్న సవాళ్లపై శిక్షణలో దృష్టి సారించినట్లు రాజన్ తెలిపారు. దాంతో పాటు కోర్టు క్రాఫ్ట్, మాక్ ట్రయల్స్‌తో సహా పబ్లిక్ రిలేషన్స్, చట్టపరమైన అంశాలకు శిక్షణలో ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.