NTR-Allu Arjun | బావ, బావ అనుకుంటూ భలే పని చేశారుగా..!

NTR-Allu Arjun | ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకూ స్టైలిష్ స్టార్‌గా ఓ రేంజ్‌‌లో ఉన్న అల్లు అర్జున్.. ‘పుష్ప 1’తో ఐకాన్ స్టార్‌గా మారిపోవడమే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కి ఎక్కేశాడు. 2021లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమాను వేరే రేంజ్‌కి తీసుకుపోయింది. దర్శకదిగ్గజం రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రేంజ్ గుర్తింపు వస్తే.. అవార్డ్ రాకపోయినప్పటికీ అంతటి ఖ్యాతిని దక్కించుకుని పాన్ ఇండియా సినిమాగా ధీటుగా నిలిచింది ‘పుష్ప’. […]

  • By: krs    latest    Jul 09, 2023 4:30 PM IST
NTR-Allu Arjun | బావ, బావ అనుకుంటూ భలే పని చేశారుగా..!

NTR-Allu Arjun |

‘అల వైకుంఠపురములో’ సినిమా వరకూ స్టైలిష్ స్టార్‌గా ఓ రేంజ్‌‌లో ఉన్న అల్లు అర్జున్.. ‘పుష్ప 1’తో ఐకాన్ స్టార్‌గా మారిపోవడమే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌కి ఎక్కేశాడు. 2021లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెలుగు సినిమాను వేరే రేంజ్‌కి తీసుకుపోయింది.

దర్శకదిగ్గజం రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రేంజ్ గుర్తింపు వస్తే.. అవార్డ్ రాకపోయినప్పటికీ అంతటి ఖ్యాతిని దక్కించుకుని పాన్ ఇండియా సినిమాగా ధీటుగా నిలిచింది ‘పుష్ప’. ఐదు భాషల్లో విడుదలైన ‘పుష్ప’ ఖండాంతరాలను దాటి మరీ ‘తగ్గేదేలే’ అనేలా దూసుకుపోయింది.

‘పుష్ప’ క్యారెక్టర్‌లో డీ గ్లామర్‌గా కనిపించడమే కాకుండా బన్నీ పూర్తి నటనకు ప్రాధాన్యం ఇచ్చారు సుకుమార్. సినిమాలోని డైలాగ్స్ పాన్ ఇండియా లెవల్లో పేలాయి. ముఖ్యంగా ‘నీయవ్వ తగ్గేదేలే’, ‘పుష్పా అంటే ఫ్లవర్ అనుకున్నావా… ఫైర్’ అనే డైలాగ్స్ ఓ రేంజ్‌లో పేలాయి. అలాగే ‘పార్టీ లేదా పుష్పా’ డైలాగ్ అయితే ఇప్పటికీ మీమ్స్‌లో తెగవాడేస్తున్నారు.

ఇక రాబోతున్న ‘పుష్ప 2’ మీద కూడా ప్రేక్షకులు బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు. దీనికి ఇంత హైప్ తెచ్చింది కూడా అల్లు అర్జునే. ఇక ‘పుష్ప 2’ సెట్స్‌పై ఉండగానే.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్‌తో పాన్ వరల్డ్ రేంజ్‌లో ఉండబోతుందనే ప్రకటన ఫ్యాన్స్‌కి పిచ్చ కిక్కేసింది. ఈ మూవీ భారీ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనుందట. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే..

ఈ సినిమాను త్రివిక్రమ్ గతంలో ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసాడట. అది ఆగిపోవడంతో ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాగా అల్లు అర్జున్‌ని ఎంచుకుని తీయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇదే తీరులో ‘అల వైకుంఠపురములో’ సినిమా టైమ్‌లో అల్లు అర్జున్‌తో కొరటాల శివ ప్లాన్ చేసిన ‘దేవర’ సినిమాను ఎన్టీఆర్ చేస్తుంటే.. ఎన్టీఆర్‌తో అనుకున్న మూవీని అల్లు అర్జున్ చేస్తున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ బావ, బావ అని పిలుచుకుంటారనే విషయం తెలిసిందే. వీరిద్దరూ బయట కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అని అంటుంటారు. అలా దర్శకులు అనుకున్న హీరోలకు కథ సూట్ కాకో.. మరో కారణం ఏదైనా ఉందో తెలియదు కానీ.. ఒకరి సినిమాలోకి మరొకరు వచ్చేశారు.

ఈ ఇద్దరూ వదులుకున్న ఈ సినిమాలలో ఏదైనా బంపర్ హిట్ కొడితే.. మాత్రం మరో హీరో పరిస్థితి ఏంటనేది ఇక్కడ ఆసక్తికరం. ఇద్దరి సినిమాలు కాస్త చేతులు మారినా.. రెండు సినిమాలు హిట్ కావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. అది విషయం.