ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో NTR.. చరణ్‌కు నిరాశ

విధాత‌: గత ఏడాది ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ ప్రభంజనం నేటికీ కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కాకపోయినా ఏదో ఒక దేశంలో ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంటుంది. దాంతో సినిమా విడుదలైనప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకు ఎక్కువ నిడివి లేదని కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. కానీ కథానుసారం ఆ పాత్రకు ఉన్న గుర్తింపు, ఆ […]

  • By: krs    latest    Jan 06, 2023 9:54 AM IST
ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో NTR.. చరణ్‌కు నిరాశ

విధాత‌: గత ఏడాది ప్రారంభమైన ఆర్ఆర్ఆర్ ప్రభంజనం నేటికీ కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కాకపోయినా ఏదో ఒక దేశంలో ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంటుంది. దాంతో సినిమా విడుదలైనప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోకు ఎక్కువ నిడివి లేదని కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

కానీ కథానుసారం ఆ పాత్రకు ఉన్న గుర్తింపు, ఆ పాత్ర ప్రాధాన్యత, ఎన్టీఆర్ చూపించిన అద్భుతమైన నటనను వారు పరిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు. ఇలాంటి త‌రుణంలో ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు ఏ ఇండియన్ స్టార్‌కు కూడా దక్కని అరుదైన గౌరవం, గుర్తింపు ఎన్టీఆర్‌కి దక్కింది.

ఆస్కార్ సందడి మొదలైంది. అతి త్వరలోనే ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కార్ నామినేషన్‌లో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు? అని కథనాలు రాస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెరైటీ ఎవరు ఆస్కార్ నామినేషన్స్‌లో నిలుస్తారు? అంటూ పదిమందితో కూడిన ఒక ఊహాజనిత జాబితాను రెడీ చేసింది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఉంది.