NTR | బాబు వద్దన్నవాడే.. వాళ్లకు ముద్దయ్యాడు.. NTR విగ్రహావిష్కరణకు జూనియర్
NTR విధాత: పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు. ఒకవేళ పనికొచ్చినా దానికి ఎక్కువ విలువ ఇవ్వరు.. దానికీ సవాలక్ష కారణాలుండొచ్చు.. రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ఎన్టీయార్ శత జయంత్యుత్సవాలను టీడీపీ చేపడుతోంది. దీనికి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖులను ఆ సభలకు ఆహ్వానిస్తోంది. మొన్నామధ్య రజనీకాంత్ కూడా అదే సభకు వచ్చారు. అలాగే ఎవరెవరికో పిలుపులు వెళుతున్నాయి.. వాళ్ళు వచ్చి ఎన్టీయార్(NTR) గురించి నాలుగు ముక్కలు మంచిగా మాట్లాడి వెళ్తున్నారు. అయితే అదే కుటుంబానికి చెందిన హరికృష్ణ […]

NTR
విధాత: పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు. ఒకవేళ పనికొచ్చినా దానికి ఎక్కువ విలువ ఇవ్వరు.. దానికీ సవాలక్ష కారణాలుండొచ్చు.. రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా ఎన్టీయార్ శత జయంత్యుత్సవాలను టీడీపీ చేపడుతోంది.
దీనికి విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రముఖులను ఆ సభలకు ఆహ్వానిస్తోంది. మొన్నామధ్య రజనీకాంత్ కూడా అదే సభకు వచ్చారు. అలాగే ఎవరెవరికో పిలుపులు వెళుతున్నాయి.. వాళ్ళు వచ్చి ఎన్టీయార్(NTR) గురించి నాలుగు ముక్కలు మంచిగా మాట్లాడి వెళ్తున్నారు.
అయితే అదే కుటుంబానికి చెందిన హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం ఈ కార్యక్రమాలకు పిలుపు లేదు.. ఆయన్ను పట్టించుకునేవాళ్ళు సైతం లేరు.. ఆయన వస్తే లోకేష్ కు క్రేజ్ తగ్గుతుందని భావించారో.. క్యాడర్ మొత్తం ఆయన వెంట పడుతుందని భయపడ్డారో కానీ చంద్రబాబు మాత్రం జూనియర్ కు ఎక్కడ అవకాశం ఇవ్వడం లేదు.
తన అన్నకొడుకును పిలవాలని బాలకృష్ణకు కూడా అనిపించకపోవడం ఇక్కడ బాధాకరం. ఆరోజు బాలయ్యబాబు విమానాశ్రయానికి వెళ్లి మరీ రజనీకాంత్ ను రిసీవ్ చేసుకుని సభా వేదిక వద్దకు తీసుకొచ్చారు. కానీ జూనియర్ కు అసలు పిలుపే లేదు.
దీంతో పిలవని పేరంటానికి ఎందుకులే వెళ్లడం అని అయన సైతం ఎక్కడా ఎటెండ్ కావడం లేదు. ఐతే తెలంగాణ నాయకులు మాత్రం జూనియర్ ను గుర్తించారు. ఖమ్మం జిల్లాలో ఆవిష్కరించనున్న భారీ ఎన్టీయార్ విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా ఆయన్ను మంత్రి పువ్వాడ అజయ్ ఆహ్వానించారు. ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ 54 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 28న ఆవిష్కరిస్తారు .
ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్‌ను తెలంగాణ మంత్రి పువ్వాడ ఆహ్వానించడం గమనార్హం. జూనియర్ ను ఎన్టీఆర్ వారసుడిగా గుర్తించడం వల్లే ఈ కార్యక్రమానికి పిలిచారు అని అనుకుంటున్నారు.
వాస్తవానికి టీడీపీ సభల్లో.. ముఖ్యముగా చంద్రబాబు.. లోకేష్ పాల్గొనే సభల్లో కార్యకర్తలు..అభిమానులు జూనియర్.. అయన తండ్రి హరికృష్ణ ఫ్లెక్షిలు పెట్టి మరీ నినాదాలు ఇస్తుంటారు. జూనియర్ రావాలని కేకలు వేస్తుంటారు. ఇది సహజంగానే చంద్రబాబును ఇబ్బంది పెడుతుంది.
నిజంగా జూనియర్ కానీ టీడీపీలోకి వస్తే పరిస్థితి మొత్తం తిరగబడే ప్రమాదం ఉందని, క్యాడర్ మొత్తం జూనియర్ వైపు పోతుందని భయపడిన చంద్రబాబు ఆయన్ను కావాలనే ఇగ్నోర్ చేస్తున్నారని అంటున్నారు. ఐతే 2009 లో మాత్రం జూనియర్ టీడీపీ తరఫున రోడ్ షో చేసారు. ఆ ప్రచారంలో ఉండగానే అయన ప్రమాదంలో గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.. ఆ తరువాత ప్రచారానికి దూరంగా ఉన్నారు.
Hero @tarak9999 Going to Khammam on 28th May to Launch Sr NTR garu statue..
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!Khammam will be on