NTR 30: ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా?
విధాత: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను.. అభిమానులందూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు వేరయా? అనేలా సేవా మార్గం వైపు నడిపించారు. బ్లడ్ డొనేషన్స్, ఇంకా ఇతర కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ అభిమానుల అర్థం మార్చేశారని.. ఎన్నో సార్లు చిరంజీవి తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు.. ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో ఆ సినిమా నిర్మాణ సంస్థపై సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా దాడి చేశారో తెలిసిందే. ఆ సినిమా అప్‌డేట్ ఎంతకీ […]

విధాత: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను.. అభిమానులందూ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు వేరయా? అనేలా సేవా మార్గం వైపు నడిపించారు. బ్లడ్ డొనేషన్స్, ఇంకా ఇతర కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ అభిమానుల అర్థం మార్చేశారని.. ఎన్నో సార్లు చిరంజీవి తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ తర్వాత ప్రభాస్ అభిమానులు.. ‘రాధేశ్యామ్’ సినిమా విషయంలో ఆ సినిమా నిర్మాణ సంస్థపై సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా దాడి చేశారో తెలిసిందే. ఆ సినిమా అప్‌డేట్ ఎంతకీ రాకపోవడంతో.. నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్‌పై ఒకానొక టైమ్‌లో దూషణకు కూడా దిగారు. ఆ దూషణలు తట్టుకోలేక.. ఆ నిర్మాణ సంస్థ రియాక్ట్ అయిన సందర్భం కూడా చూశాం. ఇప్పుడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వంతొచ్చింది.
‘RRR’ సినిమా తర్వాత యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చేయాల్సిన ‘NTR30’ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంత వరకు అప్‌డేట్ ఇవ్వలేదు. ‘RRR’ సినిమా విడుదలై చాలా కాలం అయింది. మరోవైపు ఆ సినిమాలో తనతో చేసిన రామ్ చరణ్.. ‘RC15’ అంటూ శంకర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు కన్నడ దర్శకుడితో ఓ సినిమా, సుకుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
కానీ, ఎన్టీఆర్ తన 30వ సినిమాకు సంబంధించి ఇంకా మీనమేషాలు లెక్కపెట్టాల్సిన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కాల్సి ఉంది. ‘ఆచార్య’ ఫ్లాప్, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు ఇంకా కొరటాలను కోలుకోలేకుండా చేయడంతో.. ఎన్టీఆర్‌తో చేయాల్సిన సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది.
దీంతో, ఎన్టీఆర్ అభిమానులు కొందరు.. ఆ సినిమా తెరకెక్కాల్సిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పేరుతో ట్విట్టర్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. ఒరిజినల్ అకౌంట్స్‌లో చెబుతున్నట్లుగా అప్‌డేట్స్ ఇవ్వడం మొదలెట్టారు. ‘త్వరలో సెట్స్‌పైకి, వచ్చేస్తున్నా.. బ్లాస్టింగ్ అప్‌డేట్ వచ్చేస్తోంది..’ అంటూ ఫేక్ అకౌంట్స్‌లో వచ్చే సమాచారంతో.. నిజంగానే అప్‌డేట్ వస్తుందనుకుని ఎన్టీఆర్ అభిమానులు ఆ ట్వీట్స్‌ని వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతానికైతే ఆ సినిమాకు సంబంధించి మేకర్స్ నుంచి ఎటువంటి సమాచారం అధికారికంగా బయటకు రాలేదు కానీ.. ఆ చిత్ర పీఆర్ మాత్రం ‘‘భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దర్శకుడు కొరటాల శివ, డీఓపీ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ సాబూ సిరిల్ ప్రీ పొడక్షన్ పనులు చేస్తున్నారు.. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది’’ అని ట్వీట్ చేశారు. పీఆర్ నుంచి ఈ ట్వీట్ రాకముందు దాదాపు ఓ 10 ఫేక్ అకౌంట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పేరుతో అప్‌డేట్స్ అంటూ సోషల్ మీడియాని హోరెత్తించాయి.