విధాత: మెగాస్టార్ చిరంజీవిని నందమూరి తారక రామారావు నటించిన ఓ సినిమా వణికించిందట. ఇప్పటికీ ఆ సినిమా అంటే తనకు వణుకు పుడుతుందని తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో చిరు రివీల్ చేశారు. ఇప్పటి వరకు ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదని, చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అనే వెల్లడించలేదని చెబుతూ.. చిరు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. తనతో ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ వంటి చిత్రాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి ‘ఫస్ట్ […]
విధాత: మెగాస్టార్ చిరంజీవిని నందమూరి తారక రామారావు నటించిన ఓ సినిమా వణికించిందట. ఇప్పటికీ ఆ సినిమా అంటే తనకు వణుకు పుడుతుందని తాజాగా జరిగిన ఓ ఈవెంట్లో చిరు రివీల్ చేశారు. ఇప్పటి వరకు ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదని, చెప్పుకుంటే ఎక్కడ పరువు పోతుందో అనే వెల్లడించలేదని చెబుతూ.. చిరు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు.
తనతో ‘స్వయంకృషి’, ‘ఆపద్భాంధవుడు’ వంటి చిత్రాలు తీసిన ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ నిర్మాతగా మారి ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే చిత్రం నిర్మిస్తుంది. ఆమెను ఆశీర్వదించేందుకు.. ఆ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. తన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చారు. చిరు ఈ విషయం చెబుతుంటే.. ఈవెంట్‌కి వచ్చిన వారంతా క్లాప్స్‌తో ఆడిటోరియాన్ని హోరెత్తించారు.
చిరంజీవి తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం గురించి చెబుతూ.. ‘ఇది నా చిన్నప్పటి విషయం. ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకోలేదు. షేర్ చేసుకుంటే ఎక్కడ పరువుపోతుందో అని భయం. నెల్లూరులో.. నేనప్పుడు ఆరో, ఏడో చదువుతున్నాను. అప్పటే ఎన్టీఆర్‌గారి ‘రాము’ సినిమా విడుదలైంది.
మా చుట్టాలలో పూర్ణ అనే అతనికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వాడు ఈ సినిమాకి రావాల్సిందే అని పట్టుపట్టడంతో.. నేను, నాతో పాటు నాగబాబు కూడా వచ్చాడు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే.. విపరీతమైన జనం. టికెట్స్ కోసం క్యూలోకి వెళ్లాం. ఒక్కసారిగా క్యూ ఆగిపోయింది. వెనక్కి, ముందుకి.. ఏటూ వెళ్లలేని పరిస్థితి. దీంతో నాగబాబుకి ఊపిరి ఆడనంత పనైంది.
అదే సమయంలో మా నాన్నగారు అంతకు ముందు షో చూసి బయటికి వస్తూ.. మమ్మల్ని చూశారు. అంతే.. ఇక అయిపోయాంరా దేవుడా అనుకున్నాను. అప్పటికే నాగబాబు బిక్కముఖం వేసి ఉండటంతో.. లైన్లో నుండి బయటికి తీసుకువచ్చి.. అక్కడ మొదలుకుని ఇంటికి వచ్చే వరకు కొబ్బరి మట్టతో కొడుతూనే ఉన్నారు.
అందుకే ఎన్టీఆర్‌గారి ‘రాము’ సినిమా అంటే నాకు ఇప్పటికీ వణుకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా చూడండి.. చెమటలు ఎలా పట్టాయో..’’ అంటూ చిరు తన లైఫ్‌లో జరిగిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నారు.