NV Subhash | ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ: ఎన్వీ సుభాష్

NV Subhash | బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విధాత: ఓటమి భయంతోనే కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, రెండుచోట్లా ఆయనకు ఓటమి ఖాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు. అవినీతిలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కు దోస్తీ ఉందని, తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే.. సిటింగులకు తిరిగి మళ్లీ అవకాశం కల్పించినట్లు విమర్శించారు. బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు ఎందుకు అత్యధిక సీట్లు కేటాయించలేదని […]

  • By: Somu    latest    Aug 21, 2023 11:27 AM IST
NV Subhash | ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు చోట్ల పోటీ: ఎన్వీ సుభాష్

NV Subhash |

  • బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్

విధాత: ఓటమి భయంతోనే కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, రెండుచోట్లా ఆయనకు ఓటమి ఖాయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తెలిపారు.

అవినీతిలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ కు దోస్తీ ఉందని, తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే.. సిటింగులకు తిరిగి మళ్లీ అవకాశం కల్పించినట్లు విమర్శించారు.

బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు ఎందుకు అత్యధిక సీట్లు కేటాయించలేదని ప్రశ్నించారు. మొదటి నుంచీ కేసీఆర్ మహిళా వ్యతిరేకి అని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు ఎందుకు పాటించడం లేదన్నారు.

మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే అని తెలిపారు. కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాతోనే.. బీజేపీ గెలుపునకు మార్గం సుగమమైందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదే అని ధీమా వ్యక్తం చేశారు.