ప్రారంభమైన పాత గుట్ట అధ్యయనోత్సవాలు

విధాత: యాదగిరిగుట్ట ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యయనోత్సవాలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సాయంత్రం తొళక్కం, దివ్య ప్రబంధ పారాయణములు ప్రారంభించారు. నాలుగు రోజులపాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ముగిశాక, ఈనెల 31 నుండి ఫిబ్రవరి 6 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 27నుండి ఫిబ్రవరి 6 వరకు 11 రోజుల పాటు ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కళ్యాణాలు, సుదర్శన నరసింహ […]

ప్రారంభమైన పాత గుట్ట అధ్యయనోత్సవాలు

విధాత: యాదగిరిగుట్ట ఆలయం పాత గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యయనోత్సవాలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సాయంత్రం తొళక్కం, దివ్య ప్రబంధ పారాయణములు ప్రారంభించారు.

నాలుగు రోజులపాటు జరగనున్న అధ్యయనోత్సవాలు ముగిశాక, ఈనెల 31 నుండి ఫిబ్రవరి 6 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధ్యయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 27నుండి ఫిబ్రవరి 6 వరకు 11 రోజుల పాటు ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కళ్యాణాలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా రద్దు చేశారు.