Valmedi | వచ్చే నెల 4న.. వల్మీడికి సీఎం కేసీఆర్
Valmedi | చినజీయర్ స్వామి చేత విగ్రహాల పున: ప్రతిష్టాపన నాలుగు రోజుల పాటు ఉత్సవాలు మంత్రి ఎర్రబెల్లి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రామాయణ సృష్టి కర్త వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో ఆయన నివసించిన మునుల గుట్టపై సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన ఉత్సవం వచ్చే నెల ఒకటి నుంచి 4వ తేదీ వరకు జరుగనుంది. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి పున: […]

Valmedi |
- చినజీయర్ స్వామి చేత విగ్రహాల పున: ప్రతిష్టాపన
- నాలుగు రోజుల పాటు ఉత్సవాలు
- మంత్రి ఎర్రబెల్లి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రామాయణ సృష్టి కర్త వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో ఆయన నివసించిన మునుల గుట్టపై సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన ఉత్సవం వచ్చే నెల ఒకటి నుంచి 4వ తేదీ వరకు జరుగనుంది. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి పున: ప్రతిష్టాపన జరగనుండగా, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి వల్మీడి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాట్లను సమీక్షించారు. ఐదు కోట్ల రూపాయలతో దేవాలయ పునరుద్ధరణ చేపట్టారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 30 వేల మందికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డీసీపీ సీతారాం, ఏసీపీ సురేష్ కుమార్, ఆర్టీసీ, విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు, పంచాయతీరాజ్, దేవాదాయ, డీఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు.
ఒకే వేదికపైకి చినజీయర్, కేసీఆర్
వల్మీడిలో జరిగే దేవాలయ పున: ప్రతిష్ట కార్యక్రమంలో సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామి ఇద్దరూ కలిసి పాల్గొననున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో సమాతామూర్తి ఆరోధానోత్సవాల సందర్భంగా జరిగిన శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముందు రోజు హాజరైన సీఎం, ప్రధాని కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
ఇరువురి మధ్య దూరం పెరిగిందని భావిస్తున్న తరుణంలో యాదాద్రిని చినజీయర్, మై హోం రామేశ్వ ర్రావు నిన్న సందర్శించి ప్రశంసించడం, 5 కేజీల బంగారం ఆలయానికి సమర్పించడం, తాజాగా వల్మిడీ కార్యక్రమంలో పాల్గొననున్నారని చెబుతున్నందున సయోధ్య కుదిరిందా? అనే చర్చసాగుతోంది. ఎన్నికల వేళ ఏదో మార్పు జరిగిందని భావిస్తున్నారు.