ఇక ఒకే దేశం ఒకే ఎరువు: మోడీ

విధాత: దేశంలో రైతులు త‌క్కువ ధ‌ర‌కే నాణ్య‌మైన ఎరువులు పొందేలా ఒకే దేశం ఒకే ఎరువు కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ శ్రీ‌కారం చుట్టారు. దేశ‌వ్యాప్తంగా యూరియా, డీఅమ్మోనియం ఫాస్పేట్ పొటాష్ వంటి స్థూల పోష‌కాల‌ను భార‌త్ అనే బ్రాండ్ పేరుతో మాత్ర‌మే విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఈ భార‌త్ బ్రాండ్ ఎరువుల‌తో రైతుల‌కు అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే నాణ్య‌మైన పంట పోష‌కాలు అందుతాయ‌ని చెప్పారు. పీఎం కిసాన్ స‌మ్మాన్ స‌మ్మేళ‌న్ ప‌థ‌కం కింద రూ. 16 […]

  • By: krs    latest    Oct 17, 2022 5:35 PM IST
ఇక ఒకే దేశం ఒకే ఎరువు: మోడీ

విధాత: దేశంలో రైతులు త‌క్కువ ధ‌ర‌కే నాణ్య‌మైన ఎరువులు పొందేలా ఒకే దేశం ఒకే ఎరువు కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ శ్రీ‌కారం చుట్టారు. దేశ‌వ్యాప్తంగా యూరియా, డీఅమ్మోనియం ఫాస్పేట్ పొటాష్ వంటి స్థూల పోష‌కాల‌ను భార‌త్ అనే బ్రాండ్ పేరుతో మాత్ర‌మే విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. ఈ భార‌త్ బ్రాండ్ ఎరువుల‌తో రైతుల‌కు అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే నాణ్య‌మైన పంట పోష‌కాలు అందుతాయ‌ని చెప్పారు.

పీఎం కిసాన్ స‌మ్మాన్ స‌మ్మేళ‌న్ ప‌థ‌కం కింద రూ. 16 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని విడుద‌ల చేశారు.
దేశంలో రైతుల‌ ఉత్పాద‌క‌త‌ను పెంచేందుకు కీల‌క సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ స‌మ్మేళ‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న ప‌థ‌కం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు రూ. 16 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని విడుద‌ల చేశారు.

దేశ‌వ్యాప్తంగా 22 కోట్ల మంది రైతుల‌కు సాయిల్ హెల్త్ కార్డుల‌తో పాటు 17 వంద‌ల రకాలైన విత్త‌నాల‌ను అందించి పంట ఉత్పాద‌క‌త‌ను పెంచ‌నున్న‌ట్లు ప్ర‌ధాని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా వ్య‌వ‌సాయంలో నానో యూరియా ప్రాధాన్యాన్ని తెలిపారు.

ఒక సీసా ద్ర‌వ రూప యూరియా ఒక బ‌స్తా యూరియాతో స‌మాన‌మ‌ని అన్నారు. దేశ‌వ్యాప్తంగా 600 కిసాన్ స‌మృద్ధి కేంద్రాల‌ను ప్ర‌ధాని ప్రారంభించారు. ఇప్ప‌టికే ఉన్న 3 ల‌క్ష‌ల విత్త‌న దుకాణాలు పీఎం కిసాన్ స‌మృద్ధి కేంద్రాలుగా మార‌నున్నాయ‌ని తెలిపారు.