ఒప్పో రెనో 11 సిరీస్‌ లాంచ్‌..! మొబైల్‌ ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే..!

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్రో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేసింది. అదే ఒప్పో రెనో 11. ఇందులో రెనో 11, రెనో 11 ప్రో మోడల్స్​ ఉండగా.. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి

ఒప్పో రెనో 11 సిరీస్‌ లాంచ్‌..! మొబైల్‌ ధర, ఫీచర్స్‌ వివరాలు ఇవే..!

విధాత‌: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ కంపెనీ ఒప్రో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను లాంచ్‌ చేసింది. అదే ఒప్పో రెనో 11. ఇందులో రెనో 11, రెనో 11 ప్రో మోడల్స్​ ఉండగా.. ప్రస్తుతం చైనా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే భారత్‌తో పాటు మిగతా దేశాల్లోనూ అమ్మకాలు జరిగే అవకాశం ఉన్నది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్స్‌ విషయానికి వస్తే.. రెనో 11లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్​తో కూడిన​ 6.7 ఇంచ్​ కర్వ్​డ్​ ఫుల్​-హెచ్​డీ ప్లస్‌ ఓఎల్​ఈడీ డిస్​ప్లే సెట్‌ ఉంది.


సెంటర్​ పంచ్​-హోల్​ కటౌట్​ డిజైన్​ లభిస్తుండగా.. మీడియాటెక్​ డైమెన్సిటీ 8200 ఎస్​ఓసీ చిప్​సెట్‌ను ఏర్పాటు చేసింది. 50ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా-వైడ్​, 32ఎంపీ టెలిఫొటో లెన్స్​లతో కూడిన కెమెరా సెటప్​ రీయర్‌లో వస్తుండగా.. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ ఫేసింగ్​ కెమెరా ఉంది. 4,800 ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 67వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ లభిస్తున్నది.


ఇక అలాగే ఒప్పో రెనో 11 ప్రో వెర్షన్‌లో 120హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.74 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ ప్లస్‌ డిస్​ప్లే, స్నాప్​డ్రాగన్​ 8+ జెన్​ 1 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉంది. కెమెరా సెటప్‌ అంతా రెనో 11 మాదిరిగానే ఉంటాయి. 4,700ఎంఏహెచ్​ బ్యాటరీతో పాటు 80 వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉంటుంది. ఇదిలా ఉండగా.. రెనో 11 స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు 2,499 యువాన్​- 2999 యువాన్​ మధ్యలో ఉండగా.. సుమారు రూ.29,400 నుంచి రూ. 35,200 మధ్య ఉండనున్నది.


ప్రో మోడల్​లో రెండు వేరియంట్స్‌ ఉండగా.. ధరలు 3,499 యువాన్​- 3,799 యువాన్​ మధ్యలో ఉన్నాయి. భారతీయ కరెన్సీలో సుమారు రూ.41వేల నుంచి రూ.45,500 వరకు ధర పలుకుతున్నది. ఫోన్లు ఓబ్సీడియన్​ బ్లాక్​, ఫ్లౌరైట్​ బ్లూ, మూన్​స్టోన్​ కలర్స్​లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఒప్పో రెనో 11 సిరీస్‌ భారత్‌లో ఎప్పుడు లాంచ్‌ చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. త్వరలోనే వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది.