ఇక సూది కాదు.. నోటి ద్వారా కొవిడ్ వ్యాక్సిన్
విధాత: సూది అక్కర లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విషయంలో కీలక ముందడుగు పడింది. నోటి ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ ను చైనా అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత షాంగై నగరంలో పంపిణీ చేసింది. ఇలాంటి వాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు. ఇప్పటికే పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్‌గా పనిచేస్తుందని చైనా అధికారులు వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ లోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఇన్‌హేలర్ ద్వారా ఐదు […]

విధాత: సూది అక్కర లేకుండా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విషయంలో కీలక ముందడుగు పడింది. నోటి ద్వారా కొవిడ్ వ్యాక్సిన్ ను చైనా అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత షాంగై నగరంలో పంపిణీ చేసింది. ఇలాంటి వాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటిదని భావిస్తున్నారు. ఇప్పటికే పూర్తి వ్యాక్సిన్ తీసుకున్న వారికి బూస్టర్ డోస్‌గా పనిచేస్తుందని చైనా అధికారులు వెల్లడించారు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్ లోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఇన్‌హేలర్ ద్వారా ఐదు సెకన్ల పాటు ఊపిరి పీల్చుకుంటూ లోపలికి తీసుకోవాలని నిపుణులు తెలిపారు. ఇలా ఇరవై సెకన్లలో ఈ ప్రక్రియ ముగుస్తుందని వివరించారు. సూదితో ఇష్టపడని వారికి, పేద దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
‘యశోద’ ట్రైలర్: సరొగసి మదర్‌గా సమంత! నయనతారకు ఫుల్ సఫోర్ట్
అంతేకాదు నోటి ద్వారా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంగా త్వరగా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. నోటి ద్వారా తీసుకోవడం ద్వారా వైరస్ శ్వాస మార్గంలో లోపలికి వెళ్లకముందే అంతం చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
నోటి ద్వారా తీసుకునే కొవిడ్ వ్యాక్సిన్‌ను చైనా బయోఫార్మా సంస్థ కానిసినో ఈవ్యాక్సిన్ తయారు చేసింది. వీటి ప్రయోగాలను చైనా, పాకిస్తాన్, హంగేరీ, మెక్సికో, అర్జెంటీనాతో పాటు మలేసియా దేశాల్లో పూర్తి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
దీన్ని బూస్టర్ డోస్‌గా వినియోగించేందుకు చైనా ఔషధ నియంత్రణ సంస్థలు సెప్టెంబర్‌లోనే అనుమతి ఇచ్చాయి. తాజాగా వీటి పంపిణీని మొదలుపెట్టారు. ఈ తరహా ముక్కు ద్వారా తీసుకునే టీకాలను భారత్ ఇప్పటికే సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 12 నాజల్ వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.