అసెంబ్లీ సమావేశాలకు..బస్సులో ఎమ్మెల్సీ…ఆటోలో ఎమ్మెల్యే

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో రాగా, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

అసెంబ్లీ సమావేశాలకు..బస్సులో ఎమ్మెల్సీ…ఆటోలో ఎమ్మెల్యే

విధాత : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గురువారం హుజూరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆటోలో రాగా, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలకు ఉచిత బస్సు వసతి ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లు ఎదుర్కోంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తేచ్చే ఉద్ధేశంతో తాను ఆటోలో వచ్చినట్లుగా కౌశిక్‌రెడ్డి తెలిపారు. అయితే వాహన పాస్ లేకపోవడంతో ఆయన ఆటోను అసెంబ్లీ ప్రాంగణం లోనికి అనుమతించలేదు. అటు మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించే నిమిత్తం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బస్సులో వచ్చినట్లుగా వెల్లడించారు. అటు అధికార పక్ష కాంగ్రెస్ ఎమ్మెల్సీ తమ ప్రభుత్వ పథకాన్ని చాటేలా బస్సులో వస్తే, ప్రతిపక్ష బీఆరెస్ ఎమ్మెల్యే ఆ పథకంతో ఆటో డ్రైవర్లు పడుతున్న తిప్పలు చాటేలా ఆటోలో వచ్చి పరస్పరం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ పార్టీ వైఖరులను చాటడంలో పోటీ పడినట్లుగా ఉందంటు పలువురు చర్చించుకోవడం కనిపించింది.