కూసుకుంట్ల సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన పద్మశాలీలు
విధాత, నల్గొండ: టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆదివారం పద్మశాలి సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మునుగోడు మండల కేంద్రం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వర్కాల మధుకర్, గౌరవ అధ్యక్షుడు గంజి బిక్షమయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు సంఘీశెట్టి పరమేశం, మార్కండేయ దేవస్థానం అధ్యక్షుడు కొంగరి వెంకటేష్లతో పాటు 100 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పద్మశాలీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీలో చేరామని […]

విధాత, నల్గొండ: టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గ ఇంచార్జీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఆదివారం పద్మశాలి సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మునుగోడు మండల కేంద్రం పద్మశాలి సంఘం అధ్యక్షుడు వర్కాల మధుకర్, గౌరవ అధ్యక్షుడు గంజి బిక్షమయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు సంఘీశెట్టి పరమేశం, మార్కండేయ దేవస్థానం అధ్యక్షుడు కొంగరి వెంకటేష్లతో పాటు 100 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పద్మశాలీల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు టీఆర్ఎస్ పార్టీలో చేరామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మునుగోడు నియోజకవర్గంలోని ప్రాజెక్టులు పూర్తి అవుతాయన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలన్నారు. అలాగే రాజగోపాల్ అన్న ఎంపీగా ఇప్పుడు ఉన్నా మునుగోడుకు ఏమి చేయలేదన్నారు.
అభివృద్ధి గురించి అడిగిన ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి తనను నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు రానివ్వట్లేదని, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అంటు ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. గత మూడున్నర సంవత్సరాల నుంచి ఎంపీగా వెంకటరెడ్డి ఉన్నా ఆయనను రాజగోపాల్ మునుగోడు నియోజకవర్గంకు రానివ్వలేదని నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు.

ముదిరాజ్ సంక్షేమానికి కేసీఆర్ ప్రాధాన్యత ముదిరాజుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని వారి వృత్తులకు ప్రభుత్వ పథకాల ద్వారా అభివృద్ధికి కృషి చేస్తుందని రాజకీయంగా పదవులు అందిస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అన్నారు
ఆదివారం కృష్ణ స్వామి శివ సమితి ముదిరాజ్ సేవాసమితి సభకు హాజరైన మాట్లాడుతూ.. ముదిరాజ్ సమస్యల పరిష్కారానికి నియోజకవర్గంలో తాను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి పనిచేస్తానన్నారు. తక్షణసాయంగా కృష్ణ స్వామి విగ్రహా ఏర్పాటుకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు.