గేర్లు చేంజ్ చేయడంలో దిట్ట.. అందుకే డ్రైవర్‌ను పెళ్లి చేసుకున్నా!
Pakistan teen marries driver | అందమైన మగువల కోసం మగాళ్లు అన్వేషిస్తుంటారు. మగువ లేమో.. హ్యాండ్ సమ్‌గా ఉన్న అబ్బాయిల కోసం ఆరాట పడుతుంటారు. దీంతో పాటు మంచి మనసు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా మనసులు కలిశాయనుకోండి.. ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు. కానీ ఈ అమ్మాయి ప్రేమ కథ మాత్రం భిన్నంగా ఉంది. అతని అందాన్ని చూడలేదు. అతని మనసును కూడా పట్టించుకోలేదు. డ్రైవర్‌గా గేర్లు చేంజ్ చేసే స్టైల్ నచ్చి.. అతన్ని […]

Pakistan teen marries driver | అందమైన మగువల కోసం మగాళ్లు అన్వేషిస్తుంటారు. మగువ లేమో.. హ్యాండ్ సమ్‌గా ఉన్న అబ్బాయిల కోసం ఆరాట పడుతుంటారు. దీంతో పాటు మంచి మనసు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా మనసులు కలిశాయనుకోండి.. ప్రేమించుకుంటారు. పెళ్లి కూడా చేసుకుంటారు.
కానీ ఈ అమ్మాయి ప్రేమ కథ మాత్రం భిన్నంగా ఉంది. అతని అందాన్ని చూడలేదు. అతని మనసును కూడా పట్టించుకోలేదు. డ్రైవర్‌గా గేర్లు చేంజ్ చేసే స్టైల్ నచ్చి.. అతన్ని ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. గేర్లు చేంజ్ చేయడంలో అతను దిట్ట.. అతనికి మించిన వాడెవడు లేడంటుంది ఆ నవ వధువు.
పాకిస్తాన్‌కు చెందిన 21 ఏండ్ల యువకుడు కారు డ్రైవర్ గా పని చేసుకుంటూ, జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఓ వ్యక్తి తన బిడ్డకు కారు డ్రైవింగ్ నేర్పించేందుకు ఆ యువకుడిని నియమించాడు. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో డ్రైవర్ తో ఖతిజా ప్రేమలో పడిపోయింది.
యాక్టివాలోకి దూరిన నాగుపాము.. ఈ వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
ఎందుకంటే అతని డ్రైవింగ్ స్కిల్స్ ఆమెకు అంతగా నచ్చాయి. అంతే కాదండోయ్.. డ్రైవర్ గేర్లు చేంజ్ చేయడంలో దిట్టనట. అతను గేర్ చేంజ్ చేసే విధానం తనకు బాగా నచ్చిందని ఖతిజా చెప్పుకొచ్చింది. డ్రైవింగ్ చేస్తూ గేర్లను చేత్తో చేంజ్ చేసినప్పుడు.. ఆ విధానాన్ని చూస్తుంటే టెంప్టు అయిపోతామని పేర్కొంది. అందుకే అతన్ని లవ్ చేశానని, పెళ్లి కూడా చేసుకున్నానని తెలిపింది.
అసలు కారు డ్రైవింగ్ ఎలా చేయాలో తనకు బాగా నేర్పించాడని పేర్కొంది. తన నేర్పు, ఓర్పు తనకు ఎంతగానో నచ్చాయని, అలా అతని మనసుకు దగ్గరయ్యానని తెలిపింది. తన ప్రియుడి డ్రైవింగ్ విధానం నచ్చడంతో.. అతనికి ఓ సాంగ్ ను కూడా ఖతిజా డెడికేట్ చేసింది. మరి ఆ సాంగ్ ఏందంటే.. హమ్ తుమ్ ఏక్ కమ్రే మెయిన్ బంద్ హో ఔర్ చబి ఖో జయే. 1973లో వచ్చిన బాబీ సినిమాలోనిది ఈ సాంగ్.