Pakistan | భారత్ యువకుడిని వర్చువల్‌గా పెళ్లాడిన పాక్ యువతి…
Pakistan | భారత్ (Bharath) పాకిస్థాన్ (Pakistan) ల మధ్య ప్రేమ కథల వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా భారత్‌కు చెందిన ఓ యువకుడు, పాక్ యువతి వర్చువల్‌గానే వివాహం చేసుకున్నారు. తనకు భారత వీసా దొరక్కపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యువతి తెలిపింది. కరాచీకి చెందిన అమీనా..జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్ ఖాన్‌లు పూర్తిగా వీడియో మాధ్యమం (Virtual marriage) లోనే ఇస్లాం సంప్రదాయం ప్రకారం అన్ని క్రతువులూ పూర్తి చేశారు. అయితే ఇది […]

Pakistan |
భారత్ (Bharath) పాకిస్థాన్ (Pakistan) ల మధ్య ప్రేమ కథల వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా భారత్‌కు చెందిన ఓ యువకుడు, పాక్ యువతి వర్చువల్‌గానే వివాహం చేసుకున్నారు. తనకు భారత వీసా దొరక్కపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని యువతి తెలిపింది.
కరాచీకి చెందిన అమీనా..జోధ్‌పూర్‌కు చెందిన అర్బాజ్ ఖాన్‌లు పూర్తిగా వీడియో మాధ్యమం (Virtual marriage) లోనే ఇస్లాం సంప్రదాయం ప్రకారం అన్ని క్రతువులూ పూర్తి చేశారు. అయితే ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమేనని.. పాక్‌లో తన బంధువుల ద్వారా అమీనా కుటుంబంతో సంబంధం కుదుర్చుకున్నామని అర్బాజ్ ఖాన్ వెల్లడించారు.
‘అమీనా భారత వీసా కోసం త్వరలోనే దరఖాస్తు చేసుకుంటుంది. నేను పాకిస్థాన్‌లో వివాహం చేసుకో దలచుకోలేదు. ఎందుకంటే దానిని ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. తను భారత్‌కు వచ్చాక మరోసారి పెళ్లి చేసుకుంటాం’ అని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఛార్టెడ్ ఎకౌంటెంట్‌గా పని చేస్తున్న అర్బాజ్ ఖాన్‌కు అతడి స్నేహితులు, కుటుంబం సమక్షంలో జోధ్‌పుర్‌లోని ఓస్వాల్ సమాజ్ భవన్‌లో బుధవారం ఈ వివాహం జరిగింది. గత నెల రోజుల కాలంలోనే సీమాహైదర్ అనే మహిళ పాక్ నుంచి భారత్‌లోని ప్రియుడి వద్దకు వచ్చేయగా.. ఆ తర్వాత అంజు అనే మహిళ భారత్ నుంచి పాక్‌లో ఉన్న తన ప్రియుడి వద్దకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.