పాపం అలీ.. కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి!

ఉన్నమాట: అలీ.. కమెడియన్ అలీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది.. అందులో ఉండలేడు.. బయటికి రాలేడు.. అంతన్నారు ఇంతన్నారూ గంగరాజు అన్నట్లుగా మారింది. జగమెరిగిన కమెడియన్.. వందలాది చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో ఓ స్థాయికి చేరిన నటుడు.. టీడీపీలో కొన్నాళ్ళు పనిచేసి, తనకు గుర్తింపు, గౌరవం లేదని బయటికి వచ్చి జగన్ పార్టీలో చేరాడు. గత రెండు మూడేళ్ళుగా అదిగో ఆలీకి పదవి..ఇదిగో రాజ్యసభ.. అల్లంత దూరాన వక్ఫ్ […]

  • By: krs    latest    Oct 27, 2022 3:43 PM IST
పాపం అలీ.. కుడితిలో పడ్డ ఎలుకలా పరిస్థితి!

ఉన్నమాట: అలీ.. కమెడియన్ అలీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది.. అందులో ఉండలేడు.. బయటికి రాలేడు.. అంతన్నారు ఇంతన్నారూ గంగరాజు అన్నట్లుగా మారింది. జగమెరిగిన కమెడియన్.. వందలాది చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో ఓ స్థాయికి చేరిన నటుడు.. టీడీపీలో కొన్నాళ్ళు పనిచేసి, తనకు గుర్తింపు, గౌరవం లేదని బయటికి వచ్చి జగన్ పార్టీలో చేరాడు.

గత రెండు మూడేళ్ళుగా అదిగో ఆలీకి పదవి..ఇదిగో రాజ్యసభ.. అల్లంత దూరాన వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పదవి . లేదు లేదు. ఎమ్మెల్సీ ఇస్తున్నారు ఆన్నారు . ఆమధ్య సినిమా టికెట్స్ రేట్లు పెంపు విషయమై చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు తదితరులు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు ఆలీని కూడా పిలిచారు.

ఆ సందర్భంలో ఆలీకి కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు అనిపించింది. చూస్తుంటే ఆలీకి ఏదో పదవి ఇస్తారు అనేలా పరిస్థితులు ఉండేవి.. మూణ్ణాలుగు నెలలు గడిచాక ఇదిగో ఇలా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు గా అలీ నియామకం అంటూ జీవో వచ్చింది.

అదేంటీ .. ఆలీకి ఎలాక్ట్రానిక్ మీడియా సలహాదారు ఏమిటి.. ఏదైనా మంచి నామినేటెడ్ రాజకీయ పోస్ట్ ఇస్తే ఇవ్వాలి గానీ.. జర్నలిష్టులకు ఇవ్వాల్సిన ఉద్యోగం లాంటి పదవి ఇవ్వడం ఏమిటన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.. అసలు ఆలీకి చెప్పి, ఆయన ఒప్పుకున్నాకే ఈ పోస్ట్(ఉద్యోగం)కు ఆయన్ను సెలెక్ట్ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జీతం.. భత్యం ఇస్తారు కావచ్చు కానీ వందల కొద్దీ సినిమాల్లో నటించిన ఆలీకి ఈ రెండు మూడు లక్షల జీతం ఓ లెక్కలోనిది కాదు.. మరి అలాంటపుడు ఏదో చోటా కార్యకర్తకు ఇచ్చినట్లు ఓ ఉద్యోగం ఇవ్వడం ఏమిటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయ్.. ఏమో మున్ముందు ఆలీకి ఇంకెదన్నా బాధ్యతను జగన్ ఇస్తారేమో చూడాలి.