TSPSC: పేపర్ లీకేజీ ప్రభుత్వ నిర్వాకమే: పాలమూరు అధ్యయన వేదిక

యువతకోసం ఉద్యోగ హక్కు చట్టం చేయాలి అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి.. విధాత‌: దేశ యువత జీవితం అంతా అనేక పరీక్షలు రాయటంలోనే తెల్లారి పోతున్నది. ప్రభుత్వాలు పని గట్టుకుని ప్రభుత్వ రంగాన్ని కుదిపేస్తున్నాయి. నిర్వహిస్తున్న అరకొర పరీక్షలలో ప్రశ్న పత్రాలు లీక్ చేస్తున్నాయి. లీకేజీ కారణాలను వ్యక్తుల మీద మోపి తప్పించుకో జూస్తున్నాయి.. ఈ తప్పిదానికి యువత జీవితం చాలా ఉద్రిక్త తలోకి నెట్ట బడుతున్నది. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం పై యువత […]

TSPSC: పేపర్ లీకేజీ ప్రభుత్వ నిర్వాకమే: పాలమూరు అధ్యయన వేదిక
  • యువతకోసం ఉద్యోగ హక్కు చట్టం చేయాలి
  • అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలి..

విధాత‌: దేశ యువత జీవితం అంతా అనేక పరీక్షలు రాయటంలోనే తెల్లారి పోతున్నది. ప్రభుత్వాలు పని గట్టుకుని ప్రభుత్వ రంగాన్ని కుదిపేస్తున్నాయి. నిర్వహిస్తున్న అరకొర పరీక్షలలో ప్రశ్న పత్రాలు లీక్ చేస్తున్నాయి. లీకేజీ కారణాలను వ్యక్తుల మీద మోపి తప్పించుకో జూస్తున్నాయి.. ఈ తప్పిదానికి యువత జీవితం చాలా ఉద్రిక్త తలోకి నెట్ట బడుతున్నది. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం పై యువత ఒక నిరంతర పోరాటానికి పూనుకోవాలి అని పాలమూరు అధ్యయన వేదిక ప్రో. జి. హరగోపాల్, కన్వీనర్ జిల్లా ఎం.రాఘవాచారి, కార్యవర్గ సభ్యులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యువతకు హక్కుగా ఉద్యోగాన్నిగ్యారంటీ చేస్తూ చట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. యావత్తు సమాజం అటు కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ హక్కు చట్టం చేయాలి అనే పోరాటాన్ని దేశవ్యాప్తంగా నిర్మించాలని విజ్ఞ ప్తి చేశారు. ప్రభుత్వం, మీడియా సంస్థలు యువత పట్ల తప్పుడు అవగాహనను ప్రచారం చేస్తూ వారిని న్యూనతలోకి నెడుతున్నారని తెలిపారు.

తల్లి దండ్రులు కూడా ఈ పోటీ ప్రపంచంలో యువత తట్టు కోలేక పోవటాన్ని సరిగా అర్థం చేసుకోవటం లేదని, ఈ దేశపు యువత చాలా వరకు పేద నిరుపేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలేని గుర్తు చేశారు. ఆ పిల్లల కనీస అవసరాలు కూడా తీరటం లేదు. యువత నిరుద్యోగి కారణంగా సమాజం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఎదురు తిరిగే యువతను నేరస్థులు అంటున్నారు కానీ వారికి కల్పిస్తున్న సౌకర్యాలు ఏమిటి అని ప్రభుత్వాలు ఆలోచించటం లేదు. రాజ కీయ పార్టీలు, నాయకులు తమ జెండాలు మోయిస్తున్నారు కానీ యువత పక్షాన పని చేయటం లేదు.

ఇంకో వైపు ఎక్కడి కక్కడా తప్పుడు అభివృద్ధి విధానాలతో రైతులను నిర్వాసితులను చేస్తున్నారు. ఈ సంక్షోభం సంక్షేమ పథకాలతో తీరదు. సహజ వనరులు కూడా కుటుంబాలకు దూరం చేస్తున్నారు. ఊరుమ్మడి బతుకులను కాలుష్యానికి గురి చేస్తున్నారు. టీ ఎస్ పి ఎస్ సి ప్రశ్న పత్రాలు లీక్ అయి యువత తీవ్ర సంక్షోభంలో, కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు ఏమిటి అని ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వాలు ఉద్యోగ హక్కు చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు యువతను తీవ్ర దోపిడీ చేయటానికి అవకాశం కల్పించే పని గంటలు పెంచే చట్టం రద్దు చేసి పని గంటలు తగ్గించి ఎక్కువ మంది, ఎక్కువ షిఫ్ట్ లలో పని చేసే విధానం రూపొందించాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ హక్కు చట్టం కోసం మేం ఉద్యమం నిర్మిస్తాం. ప్రభుత్వాలను పార్టీలను నిలదీస్తాం.. తెగించి పోరాడితే విజయం యువతరానిదే అనితెలిపారు .