Parineeti Chopra-Raghav Chadha | బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్..!
Parineeti Chopra-Raghav Chadha | బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి ముంబయి, ఢిల్లీలో డిన్నర్, లంచ్‌లకు రెస్టారెంట్లకు వెళుతూ మీడియాకు చిక్కారు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సందడి చేశారు. అయితే, తాము ప్రేమలో ఉన్నామని కానీ లేమని కానీ ఇప్పటి వరకు […]

Parineeti Chopra-Raghav Chadha | బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి ముంబయి, ఢిల్లీలో డిన్నర్, లంచ్‌లకు రెస్టారెంట్లకు వెళుతూ మీడియాకు చిక్కారు. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా సందడి చేశారు. అయితే, తాము ప్రేమలో ఉన్నామని కానీ లేమని కానీ ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు. ఇంతకు ముందు ఆప్ ఎమ్మెల్యేతో పాటు బాలీవుడ్ సింగర్ ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా మరోసారి పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి. పెళ్లికి ముందుగా ఈ నెల 13న నిశ్చితార్థం కార్యక్రమం జరుగనున్నట్లు తెలుస్తున్నది. దాదాపు 150 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తున్నది. ఈ వేడుకకు రాజకీయ, సినీ రంగ ప్రముఖులందరూ హాజరుకానున్నారు. ఇక పెళ్లి జరిగే తేదీ నిర్ణయం కానప్పటికీ.. ఈ ఏడాది చివరలో ఉండవచ్చని సమాచారం. అయితే గతంలోనూ నిశ్చితార్థం పెళ్లి వార్తలు వచ్చినా జరుగలేదు. తాజాగా ఎంగేజ్‌మెంట్ వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ నిశ్చితార్థం, పెళ్లి వార్తలపై అటు పరిణీతి చోప్రా కానీ, రాఘవ్ చద్దా కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తలు నిజామా? లేక కేవలం పుకార్లేనా? తెలియాలి అంటే శనివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఇదిలా ఉండగా.. పరిణీతి, రాఘవ్ చద్దా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. కొంతకాలంగా ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం పరిణీతి చోప్రా ‘చమ్కిలా’లో నటిస్తున్నది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇద్దరు పంజాబీ గాయకులు అమర్‌జోత్ కౌర్, అమర్‌సింగ్ చమ్కిలా చుట్టూ తిరుగనున్నది.