పాతగుట్ట బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం.. దేవతాహ్వానం

విధాత, యాదగిరిగుట్ట దేవస్థానం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి వారి వాహనమైన గరుడాళ్వార్ ను వేదమంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభంపై అలంకరించి బ్రహ్మోత్సవాలకు 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానించడం ధ్వజారోహణ వేడుక ప్రత్యేకత. వేడుక లో గరుడాళ్వార్ కు గరుడ ముద్ద లను సమర్పించారు. సాయంత్రం నిత్యారాధనలు, వేద పారాయణాలు, మూల మంత్ర అనుష్టానాల పిదప భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు. స్వామివారి […]

పాతగుట్ట బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం.. దేవతాహ్వానం

విధాత, యాదగిరిగుట్ట దేవస్థానం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు.

స్వామి వారి వాహనమైన గరుడాళ్వార్ ను వేదమంత్రోచ్చరణల మధ్య ధ్వజస్తంభంపై అలంకరించి బ్రహ్మోత్సవాలకు 33 కోట్ల మంది దేవతలను ఆహ్వానించడం ధ్వజారోహణ వేడుక ప్రత్యేకత. వేడుక లో గరుడాళ్వార్ కు గరుడ ముద్ద లను సమర్పించారు.

సాయంత్రం నిత్యారాధనలు, వేద పారాయణాలు, మూల మంత్ర అనుష్టానాల పిదప భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలకు బ్రాహ్మాది దేవతలను రాగతాళ, వాయిద్యాలతో వేదమంత్రోచ్చారణలతో ఆహ్వానించడం దేవతాహ్వానం ప్రత్యేకత. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం ఎదుర్కోలు ఘట్టం నిర్వహించనున్నారు