నన్ను మద్దిలో ఒగ్గేత్తారా! TDP అధిష్టానంపై గుణుస్తున్న పతివాడ!
విధాత: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఒక్కో నియోజకవర్గం మీద దృష్టిపెట్టి ఇన్‌చార్జిలుగా యువత లేదా బలమైన వాళ్ళను నియమిస్తూ పోతున్నారు. ఇంకా పాతకాలపు రాజకీయాలు చేసే వృద్ధతరాన్ని కంటిన్యూ చేసేది లేదని చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారు. ఈ తరుణంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి కర్రోతు బంగార్రాజును ఇన్‌చార్జిగా నియమించారు. బహుశా ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. ఈయన్ను నియమిస్తూ ఉత్తర్వులు రాగానే అక్కడి సీనియర్ నాయకుడు […]

విధాత: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీ తన సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఒక్కో నియోజకవర్గం మీద దృష్టిపెట్టి ఇన్‌చార్జిలుగా యువత లేదా బలమైన వాళ్ళను నియమిస్తూ పోతున్నారు. ఇంకా పాతకాలపు రాజకీయాలు చేసే వృద్ధతరాన్ని కంటిన్యూ చేసేది లేదని చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారు. ఈ తరుణంలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి కర్రోతు బంగార్రాజును ఇన్‌చార్జిగా నియమించారు. బహుశా ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. ఈయన్ను నియమిస్తూ ఉత్తర్వులు రాగానే అక్కడి సీనియర్ నాయకుడు అలక.. అసహనం చూపుతున్నారు.
భోగాపురం నెల్లిమర్ల నుంచి ఏకంగా ఏడు సార్లు గెలిచిన పతివాడ నారాయణస్వామి నాయుడిని కాదని గతంలో ఎంపిపిగా పని చేసిన కర్రోతు బంగార్రాజుకు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. పతివాడ నారాయణ స్వామి నాయుడు టీడీపీ ఆవిర్భావం నుంచి వరుసగా 2004 వరకు భోగాపురం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భోగాపురం రద్దు అయింది. నెల్లిమర్ల పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటైంది.
1983 నుంచి 2004 వరకు ఆరుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పతివాడ నారాయణస్వామి నాయుడుకు తొలిసారిగా 2009లో ఓటమి ఎదురైంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు కాపు సామాజికవర్గానికే చెందిన బడుకొండ అప్పలనాయుడు గెలుపొందారు. అయితే 2014లో మరోసారి పతివాడ నారాయణస్వామి నాయుడు నెల్లిమర్ల నుంచి విజయ ఢంకా మోగించారు. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బడుకొండ అప్పలనాయుడు చేతిలో మళ్ళీ పతివాడ ఓడిపోయారు.
గతంలో పతివాడ చంద్రబాబు కేబినెట్లో చక్కెర పరిశ్రమల మంత్రిగా కూడా పని చేశారు. అయితే ప్రస్తుతం పతివాడ నారాయణస్వామి ఎనభై ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉన్నారు. ఆరోగ్యం కూడా పెద్దగా సహకరిం చడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన తన కుమారుడికి ఇన్‌చార్జి పదవిని ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆర్థికంగా గట్టివాడు, ఇంకా యాక్టివ్ గా పని చేస్తున్న కర్రోతు బంగార్రాజును నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. దీంతో పెద్దాయన కాస్త బాధపడ్డారు.
తనను కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా వేరేవాళ్లను నియమించారని, నలభయ్యేళ్ల తన సర్వీసుల ను పార్టీ ఇప్పుడు పూర్తిగా ఇగ్నోర్ చేసిందని అన్నారు. తన కుటుంబానికి ఏదోలా న్యాయం చేయాలని పార్టీని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇలా సీనియర్లను పక్కనబెట్టేస్తూ యువత.. ఉత్సాహవంతులైన వారిని ఎంకరేజ్ చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారనడానికి ఈ నెల్లిమర్ల ఓ ఉదాహరణ.