పవన్ కళ్యాణ్ లెక్క తెల్చేశారా.. నోటికొచ్చిన అంకె చెబుతున్నారా!

విధాత: ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క తేల్చేశారు. తాను ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో.. తన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో..తాను ఒంటరిగా వెళ్తాడా టీడీపీతో వెళ్తాడా..ఇదేదీ తేల్చలేదు కానీ వైస్సార్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీకి 42 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. తన పార్టీని బలోపేతం చేయడం.. క్యాడర్లో నమ్మకాన్ని నింపడం.. […]

  • By: krs    latest    Sep 19, 2022 10:43 AM IST
పవన్ కళ్యాణ్ లెక్క తెల్చేశారా.. నోటికొచ్చిన అంకె చెబుతున్నారా!

విధాత: ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో లెక్క తేల్చేశారు. తాను ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో.. తన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో..తాను ఒంటరిగా వెళ్తాడా టీడీపీతో వెళ్తాడా..ఇదేదీ తేల్చలేదు కానీ వైస్సార్సీపీకి ఎన్ని సీట్లు వస్తాయో తేల్చేశారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైస్సార్సీపీకి 42 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. తన పార్టీని బలోపేతం చేయడం.. క్యాడర్లో నమ్మకాన్ని నింపడం.. తాను నిత్యం ప్రజల్లో ఉండడం వంటి ప్రక్రియలను వదిలేసి కేవలం వైస్సార్సీపీని టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందో పవన్‌కు మాత్రమే తెలియాలి.

ఇప్పుడున్న 151 సీట్లలో రెండొంతులు సీట్లను కోల్పోయి కేవలం 67 స్థానాలు మాత్రమే వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. తాను ఏదైనా సంస్థతో సర్వే చేయించారా లేదా జగన్ మీద దుగ్ధతో ఇంకా ఉజ్జయింపుగా నోటికొచ్చిన అంకె చెబుతున్నారా అన్నది ఆయనకే తెలియాలి.

ఇదిలా ఉండగా అక్టోబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తానని ప్రకటించిన పవన్ తన యాత్రను వాయిదా వేశారు. మళ్ళీ యాత్ర ఎప్పుడు ప్రారంభించేది తరువాత ప్రకటిస్తామని జనసేన పేర్కొంది. మరో వైపు టీడీపీతో పొత్తు కోసం పవన్ చేయి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు కోసం చూస్తోంది.