Pawan Kalyan | పవన్ కళ్యాణ్‌ని తాతయ్య అంటూ ర్యాగింగ్ చేసిన బుడ్డోడు.. అంత ధైర్యం ఎక్కడిది..!
Pawan Kalyan | ఒకప్పుడు నటుడిగా మాత్రమే ప్రేక్షకులని పలకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటున్నారు. సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి రాజకీయాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఏపీలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. రీసెంట్‌గా విశాఖపట్టణంలోని దసపల్లా హోటల్‌లో జనసేన జనవాణీ కార్యక్రమం కొనసాగుతుండగా, కొందరు దివ్యాంగులు పవన్ కళ్యాణ్‌ని కలవడానికి వచ్చారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలని పవన్‌కి విన్నవించుకున్నారు. అంగవైకల్యం […]

Pawan Kalyan |
ఒకప్పుడు నటుడిగా మాత్రమే ప్రేక్షకులని పలకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజలకి చాలా దగ్గరగా ఉంటున్నారు. సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చి రాజకీయాలపైనే పూర్తి దృష్టి పెట్టారు. ఏపీలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
రీసెంట్‌గా విశాఖపట్టణంలోని దసపల్లా హోటల్‌లో జనసేన జనవాణీ కార్యక్రమం కొనసాగుతుండగా, కొందరు దివ్యాంగులు పవన్ కళ్యాణ్‌ని కలవడానికి వచ్చారు. వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలని పవన్‌కి విన్నవించుకున్నారు. అంగవైకల్యం కనిపిస్తున్నప్పటికీ సర్టిఫికెట్స్ కావాలని ,అది ఉంటేనే ఆర్ధిక సాయం చేస్తామని అంటున్నారని, కొందరకి సర్టిఫికెట్స్ ఉన్నా కూడా సాయం అందడం లేదని వారు చెప్పుకొచ్చారు.
అయితే అదే సమయంలో దివ్యాంగుల పిల్లలు ఒక్కొక్కరిని ప్రేమగా పలకరించి వారు మాట్లాడే మాటలకి తెగ మురిసిపోయారు. సాధారణంగా పవన్ కళ్యాణ్‌ని ఏదైన ఫన్నీగా పిలుస్తుంటే ఎంత పడిపడి నవ్వుతారో మనకు తెలిసిందే. ఇక మానసిక దివ్యాంగ పిల్లలు ఏమన్నా కూడా ఆయన నొచ్చుకోకుండా సంతోష పడ్డారు.
ఓ దివ్యాంగ పిల్లవాడు పవన్ కళ్యాణ్‌ని ముందుగా బాహుబలి అని పిలిచాడు. ఆ వెంటనే డాడీ.. డాడీ.. అని., ఆ వెంటనే తాత .. తాత.. అని పిలిచారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడి తుంటరి పనులకి చాలా మురిసి పోయారు. పిల్లాడి పిలుపు విని నవ్వుకున్న పవన్ కళ్యాణ్.. నీ అల్లరి ఎక్కువైంది అంటూ.. పిల్లాడిని సరదాగా మందలించారు.
అంతేకాదు పిల్లాడి పక్కనే ఉన్న వ్యక్తి ఆయనట మాటలకు ఆడ్డుపడుతుంటే.. పిల్లడి మాటలను సరిచేయద్దంటూ మందలించడం ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.
ఇక దివ్యాంగులను ఇబ్బంది పెట్టేవారిని శిక్షించే చట్టం రావాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. మా ప్రభుత్వం వస్తే దివ్యాంగులకి తప్పక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సారి ఎన్డీఏ మీటింగ్‌కు వెళ్ళినప్పుడు ప్రధానమంత్రితో మాట్లాడి దివ్యాంగులకి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందరిని ఎడ్యుకేట్ చేసే బాధ్యత తాను తీసుకుంటానని పవన్ చెప్పడం విశేషం.