Pawan Kalyan | పవన్ కళ్యాణ్.. నువ్వు కూరలో తాలింపువు: పోసాని కృష్ణమురళి
Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాటల తూటాలు పేలుస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కిపోతుంది. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రీసెంట్‌గా పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే వలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనం అని ఆమె అన్నారు. ఇక బుధవారం పోసాని […]

Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాటల తూటాలు పేలుస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కిపోతుంది. ఏలూరు సభలో పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు.
రీసెంట్‌గా పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే వలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనం అని ఆమె అన్నారు.
ఇక బుధవారం పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు గుప్పిట్లో పవన్ కళ్యాణ్ ఉన్నారని , ఆయన చెప్పినట్టు పవన్ ఆడుతున్నాడని పోసాని విమర్శలు గుప్పించారు.
నువ్వు పార్టీ పెట్టినప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి వెల్కమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పాను. కాని మా కమ్మ నాయకుడైన చంద్రబాబుని నమ్మి, మా కమ్మ మీడియాను నమ్మి.. 24 గంటలూ జగన్ నాశనం అయిపోవాలని పాట పాడుతున్నవ్.
ప్రజల గుండెల్లో ఉన్నంతకాలం.. నువ్వయినా, జగన్ అయినా, మరొకడయినా ప్రజలు దీవించినంత కాలం, ప్రజలు ఆశీర్వదించినంత కాలం ముఖ్యమంత్రిగా ప్రజల గుండెలలలో ఉంటారని పోసాని చెప్పుకొచ్చారు. నువ్వు. ఒక దుర్మార్గుడి గుప్పిట్లో ఉన్నావ్. అంతేకాదు దుర్మార్గులైన రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 వాడి గుప్పిట్లో ఉన్నావ్ కాబట్టి వారు నిన్ను కూరలో కరివేపాకులా వాడుకొని వదిలేస్తారని పోసాని విమర్శించారు.
అంతటితో ఆగకుండా కూరలో తాలింపులా నిన్ను వాడుకుంటారు. నీకు తెలియని విషయం ఒకటి చెబుతాను. భీమవరంలో నువ్వు ఓడిపొవడానికి కారణం టీడీపీ అనే విషయం నీకు తెలుసా? వారు నువ్వు ఓడిపోవాలని రూ .15 కోట్లు ఇచ్చి ప్రచారం చేశారు.
కావాలంటే ఎంక్వయి కూడారీ చేసుకో. నువ్వు భీమవరంలో ఓడిపోయే అవకాశం లేకున్నా కూడా ఓడిపోయావ్ అంటే అది టీడీపీ వల్ల అని నిజం తెలుసుకో అని పోసాని చెప్పుకొచ్చారు. దేవుడే అతడిని కాపాలని పోసాని షాకింగ్ కామెంట్స్ చేశారు