‘PAY CM’ బొమ్మై.. ఇక్కడ 40 కమీషన్ స్వీకరించబడును
విధాత : ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైపై జోరుగా విమర్శలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో పేసీఎం అని ముద్రించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు బెంగళూరు సిటీ అంతటా అతికించారు. ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’తో సీఎం బసవరాజ్ బొమ్మైని పోలుస్తూ ‘పేసీఎం’ అంటూ, క్యూఆర్ కోడ్ ముద్రించిన పోస్టర్లు బెంగళూరు […]

విధాత : ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైపై జోరుగా విమర్శలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో పేసీఎం అని ముద్రించిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు బెంగళూరు సిటీ అంతటా అతికించారు.

ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’తో సీఎం బసవరాజ్ బొమ్మైని పోలుస్తూ ‘పేసీఎం’ అంటూ, క్యూఆర్ కోడ్ ముద్రించిన పోస్టర్లు బెంగళూరు అంతటా వెలిశాయి. ‘ఇక్కడ 40 కమీషన్ స్వీకరించబడును’ అని సందేశం రాశారు.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కాంగ్రెస్ ప్రారంభించిన ‘40 పర్సెంట్ సర్కారా’ వెబ్‌సైట్ ఓపెన్ అవుతున్నదని అధికారులు తెలిపారు. పేసీఎం పోస్టర్లపై బొమ్మై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పోస్టర్ల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలని దర్యాప్తునకు ఆదేశించారు.
ప్రస్తుత బీజేపీ హయాంలో ఏ పని జరగాలన్న 40 శాతం కమిషన్ ముట్టజెప్పాలనే తీరును పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ ఈ పోస్టర్లను ఏర్పాటు చేసింది. బీజేపీ ప్రభుత్వం లూటీదారులు, స్కామ్‌స్టర్‌లతో నిండిపోయిందని కర్నాటక కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు. కాషాయ సర్కార్ అవినీతిపై తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది.