Warangal: స్టేషన్‌లోనే ‘బార్‌’.. పోలీసుల జ‌ల్సా! సోషల్ మీడియాలో వైర‌ల్

  • By: sr    latest    Mar 06, 2025 3:50 PM IST
Warangal: స్టేషన్‌లోనే ‘బార్‌’.. పోలీసుల జ‌ల్సా! సోషల్ మీడియాలో వైర‌ల్

విధాత, వరంగల్: అక్కడ ఇక్కడ మందు పార్టీ చేసుకుంటే ఇబ్బంది ఎదురవుతుందో ఏమో అనుకున్నారో లేక మన స్టేషన్ ఏ కదా భద్రంగా ఉండొచ్చని భావించారేమో గానీ ఏకంగా పోలీస్ స్టేషన్‌ను బారుగా మార్చేశారు మన ఘనత వహించిన పెద్ద వంగర పోలీసులు. స్టేషన్‌లోనే జల్సాకు సిద్ధమై మందు పార్టీ చేసుకున్నారు. వీరికి ఇద్దరు బయటి వ్యక్తులు తోడయ్యారు.

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఫిర్యాదుదారులను పట్టించుకోకుండా మందు పార్టీలో నిమగ్నమయ్యారు. ఈ మందు పార్టీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పోలీసుల వ్యవహారం కాస్త బయటికి పొక్కింది.

పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసిన సిబ్బందిపై జిల్లా ఎస్పీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజల డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.