KCRకు బూట్లు కొనిచ్చేంత పెద్ద దానివా: షర్మిలపై పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజం

విధాత: సీఎం కేసీఆర్‌కే బూట్లు కొనిచ్చేంత పెద్దదానివైపోయినావా నీవు.. లేక బూట్ల షాప్ ఏమైనా పెట్టుకున్నావా అంటూ వైసిపి తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపిస్తానంటూ అపహాస్యంగా షర్మిల మాట్లాడడం బాగాలేదన్నారు. షర్మిల పాదయాత్ర చేసుకోవచ్చని, కేసీఆర్‌ను టార్గెట్ చేసి పాదయాత్రల పేరుతో దూషిస్తే ఊరుకోం అని, పాత పరిస్థితులు పునరావృతమవుతాయన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు పాదయాత్రలు చేసినా వారి కాళ్లకు బొబ్బలు కట్టడం […]

KCRకు బూట్లు కొనిచ్చేంత పెద్ద దానివా: షర్మిలపై పెద్ది సుదర్శన్‌రెడ్డి ధ్వజం

విధాత: సీఎం కేసీఆర్‌కే బూట్లు కొనిచ్చేంత పెద్దదానివైపోయినావా నీవు.. లేక బూట్ల షాప్ ఏమైనా పెట్టుకున్నావా అంటూ వైసిపి తెలంగాణ అధ్యక్షురాలు షర్మిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపిస్తానంటూ అపహాస్యంగా షర్మిల మాట్లాడడం బాగాలేదన్నారు.

షర్మిల పాదయాత్ర చేసుకోవచ్చని, కేసీఆర్‌ను టార్గెట్ చేసి పాదయాత్రల పేరుతో దూషిస్తే ఊరుకోం అని, పాత పరిస్థితులు పునరావృతమవుతాయన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు పాదయాత్రలు చేసినా వారి కాళ్లకు బొబ్బలు కట్టడం తప్ప ఒరిగేందేమీ ఉండదన్నారు.

పాదయాత్రలు ఎవరైనా చేసుకోవచ్చని గతంలో రాజశేఖర్ రెడ్డి చేశాడని, జగన్ రెడ్డి చేశారని, కానీ షర్మిల మాదిరిగా చిల్లర విమర్శలు చేయలేదన్నారు. షర్మిల వ్యవహారంపై అధిష్ఠానంతో మాట్లాడుతామన్నారు. ప్రశాంతంగా షర్మిల పాదయాత్ర చేసుకుంటే తమకేమీ ఇబ్బంది లేదన్నారు.