ఫొటో కోసం.. వందేభారత్‌ రైలు ఎక్కాడు.. సరదా తీరింది.!

విధాత: వందేభారత్‌ రైలు అంటే.. అదో… క్రేజ్‌. తన సొంత ఊరు రాజమండ్రికి వచ్చిన వందేభారత్ రైలుకు స్వాగతం పలికాడు. అలాగే సరదాగా రైలులోకి ఎక్కి తీపిగుర్తుగా ఓ సెల్ఫీ తీసుకొందామని అనుకొన్నాడు. అంతే… సెల్ఫీ తీసుకొనే లోపే.. డోర్‌ మూసుకున్నది. రైలు కదిలింది. ఏం చేయాలో తోచక హైరానా పడుతున్న రాజమండ్రి వాసిని చూసి టీసీ దగ్గరికి వచ్చి కంగారు పడకు. ఇక నువ్వు విజయవాడలో దిగాల్సిందేనని తేల్చి చెప్పాడు. వందేభారత్ రైలు టికెట్‌ ధర […]

  • By: krs    latest    Jan 17, 2023 11:34 AM IST
ఫొటో కోసం.. వందేభారత్‌ రైలు ఎక్కాడు.. సరదా తీరింది.!

విధాత: వందేభారత్‌ రైలు అంటే.. అదో… క్రేజ్‌. తన సొంత ఊరు రాజమండ్రికి వచ్చిన వందేభారత్ రైలుకు స్వాగతం పలికాడు. అలాగే సరదాగా రైలులోకి ఎక్కి తీపిగుర్తుగా ఓ సెల్ఫీ తీసుకొందామని అనుకొన్నాడు. అంతే… సెల్ఫీ తీసుకొనే లోపే.. డోర్‌ మూసుకున్నది. రైలు కదిలింది.

ఏం చేయాలో తోచక హైరానా పడుతున్న రాజమండ్రి వాసిని చూసి టీసీ దగ్గరికి వచ్చి కంగారు పడకు. ఇక నువ్వు విజయవాడలో దిగాల్సిందేనని తేల్చి చెప్పాడు.

వందేభారత్ రైలు టికెట్‌ ధర విమానం కన్నా ఎక్కువ ఉన్న విషయం యాదికొచ్చింది. రైల్‌ టికెట్‌, ఫెనాల్టీ, తిరుగు ప్రయాణం ఖర్చు అంతా ఊహించుకుంటేనే సెల్ఫీ సరదా రాయుడి గుండె గుభేల్‌మన్నది. ఈ మధ్యన ఓ సెల్ఫీ ప్రాణం మీదికి తెస్తున్న ఘటనలు చూస్తున్నాం, ఇలా జేబు ఖాళీ చేసిన ఘటన ఇదే.