PM Modi | 8న హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

PM Modi | ఈ నెల 8వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు మోదీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. 8వ తేదీన ఉద‌యం 11:30 గంట‌ల‌కు మోదీ హైద‌రాబాద్ చేరుకుంటారు. మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు తిరిగి ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్తారు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet Airport)కు మోదీ వ‌స్తారు. 11:45 గంట‌ల‌కు సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌(Secunderabad Railway station)కు చేరుకుంటారు. 11:45 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల […]

PM Modi | 8న హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ.. షెడ్యూల్ ఇదే..

PM Modi | ఈ నెల 8వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేర‌కు మోదీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ ఖ‌రారైంది. 8వ తేదీన ఉద‌యం 11:30 గంట‌ల‌కు మోదీ హైద‌రాబాద్ చేరుకుంటారు. మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు తిరిగి ఢిల్లీ బ‌య‌ల్దేరి వెళ్తారు.

ఉద‌యం 11:30 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet Airport)కు మోదీ వ‌స్తారు. 11:45 గంట‌ల‌కు సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్‌(Secunderabad Railway station)కు చేరుకుంటారు. 11:45 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య‌లో సికింద్రాబాద్ – తిరుప‌తి వందే భార‌త్(Vande Bharat) రైలును మోదీ ప్రారంభించ‌నున్నారు.

అనంత‌రం 12:15 గంట‌ల‌కు ప‌రేడ్ గ్రౌండ్‌( Parade Ground )కు ప్ర‌ధాని చేరుకుంటారు. 12:18 నుంచి 1:20 వ‌ర‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు, వివిధ ప్రాజెక్టుల‌ను మోదీ జాతికి అంకితం చేస్తారు. అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మోదీ ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బ‌య‌ల్దేరుతారు.

ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించే మోదీ బ‌హిరంగ స‌భ‌కు రాష్ట్ర బీజేపీ నాయ‌క‌త్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బీజేపీ నేత‌లు ప‌రిశీలిస్తున్నారు. ఈ స‌భ‌కు జ‌నాన్ని భారీగా స‌మీక‌రించేం దుకు రాష్ట్ర నాయ‌క‌త్వం ఏర్పాట్లు చేస్తోంది. టెన్త్ పేప‌ర్ లీకేజీ కేసులో బండి సంజ‌య్‌ను క‌రీంన‌గ‌ర్ జైలుకు త‌ర‌లించిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ స‌భ‌కు హాజ‌రు అయ్యే అవ‌కాశం లేదు.

మొత్తంగా రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు లేకుండానే మోదీ ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌రేడ్ గ్రౌండ్ బ‌హిరంగ స‌భ‌లో మోదీ.. బండి సంజ‌య్ అరెస్టుపై ప్ర‌స్తావించే అవ‌కాశం ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తూ మోదీ ప్ర‌సంగం కొన‌సాగే అవ‌కాశం ఉంది.