Heeraben Modi | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూత
Heeraben Modi | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన హీరాబెన్.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు యూఎన్ మెహతా హార్ట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. హీరాబెన్ మోదీ బుధవారం అస్వస్థతకు గురి కావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. తల్లి ఆస్పత్రిలో చేరగానే, మోదీ నేరుగా అహ్మదాబాద్ వచ్చి ఆమె ఆరోగ్య […]

Heeraben Modi | ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన హీరాబెన్.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3:39 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు యూఎన్ మెహతా హార్ట్ హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి.
హీరాబెన్ మోదీ బుధవారం అస్వస్థతకు గురి కావడంతో.. ఆమెను ఆస్పత్రికి తరలించిన విషయం విదితమే. తల్లి ఆస్పత్రిలో చేరగానే, మోదీ నేరుగా అహ్మదాబాద్ వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.
హీరాబెన్ మోదీ గాంధీనగర్‌కు సమీపంలోని రయ్‌సన్ గ్రామంలో మోదీ చిన్న తమ్ముడు పంకజ్ మోదీ వద్ద ఉంటుంది. గుజరాత్ పర్యటనకు వచ్చినప్పుడల్లా.. మోదీ తన తల్లి వద్దకు వచ్చి పోయేవారు. ఇక ప్రతి పుట్టిన రోజు మోదీ తన తల్లి వద్దకు వచ్చి ఆశీర్వాదం తీసుకునేవారు. హీరాబెన్ పుట్టినరోజు వేడుకలకు కూడా హాజరయ్యేవాడు. ఇటీవలే ఆమె 100వ జన్మదినాన్ని జరుపుకున్నారు.