షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్

విదాత: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేశారు. షర్మిల ఇటీవల పోలీసులు కారులో ఉండగానే టోయింగ్ వాహనంతో స్టేషన్‌కు తరలించిన ఘటనపై మోదీ ఫోన్‌లో షర్మిలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసినట్టు సమాచారం. మోదీ దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడడం జరిగిందని, ఈ సందర్భంగా మోదీని కలవాలని షర్మిల కోరగా, ఆయన ఢిల్లీకి రావాలని సూచించారని సమాచారం. ప్రధాని తనకి ఫోన్ చేసిన విషయం […]

  • By: krs    latest    Dec 06, 2022 9:13 AM IST
షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్

విదాత: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేశారు. షర్మిల ఇటీవల పోలీసులు కారులో ఉండగానే టోయింగ్ వాహనంతో స్టేషన్‌కు తరలించిన ఘటనపై మోదీ ఫోన్‌లో షర్మిలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసినట్టు సమాచారం.

మోదీ దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడడం జరిగిందని, ఈ సందర్భంగా మోదీని కలవాలని షర్మిల కోరగా, ఆయన ఢిల్లీకి రావాలని సూచించారని సమాచారం. ప్రధాని తనకి ఫోన్ చేసిన విషయం షర్మిల సైతం ధ్రువీకరించారు.

షర్మిల అరెస్టును ఇటీవల తెలంగాణ బీజేపీ నేతల నేతలతో పాటు గవర్నర్ తమిళ సై సైతం ఖండించి సానుభూతి వ్యక్తం చేశారు.. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ సైతం నేరుగా షర్మిలకి ఫోన్ చేసి పరామర్శించడం.. అలాగే నిన్న ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు సన్నాహక అఖిలపక్ష సమావేశంలో సైతం ఏపీ సీఎం జగన్ ను మోదీ షర్మిల అరెస్టు విషయమై వాకబు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.