Vande Bharat Express | ఒకేసారి ఐదు మార్గాల్లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌..! రేపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న ప్రధాని మోదీ..!

Vande Bharat Express | భారతీయ రైల్వేశాఖ కొత్తగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లకు ఆదరణ లభిస్తున్నది. దీంతో కొత్త మార్గాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లను పట్టాలెక్కించబోతున్నది. ఇందులో భాగంగానే ఒకేసారి ఐదు రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఆయా రైళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసి.. ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. కొత్త వాటితో కలిసి 23 చేరనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌ విధానంలో […]

Vande Bharat Express | ఒకేసారి ఐదు మార్గాల్లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌..! రేపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్న ప్రధాని మోదీ..!

Vande Bharat Express |

భారతీయ రైల్వేశాఖ కొత్తగా తీసుకువచ్చిన వందే భారత్‌ రైళ్లకు ఆదరణ లభిస్తున్నది. దీంతో కొత్త మార్గాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లను పట్టాలెక్కించబోతున్నది. ఇందులో భాగంగానే ఒకేసారి ఐదు రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఆయా రైళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసి.. ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా 18 మార్గాల్లో వందే భారత్‌ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. కొత్త వాటితో కలిసి 23 చేరనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వర్చువల్‌ విధానంలో ఐదు సెమీ హైస్పీడ్‌ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. పాట్నా-రాంచీ, ముంబయి – గోవా, బెంగళూరు – హుబ్బలి, భోపాల్‌ – ఇండోర్‌, భోపాల్‌ – జబల్‌పూర్‌ మార్గాల్లో రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇప్పటికే రైల్వేశాఖ విజయవంతంగా ట్రయల్‌ రన్‌ నిర్వహించింది.

బిహార్‌ – రాంచీ : బిహార్‌ నుంచి జార్ఖండ్‌ రాజధాని రాంచీ మధ్య వందే భారత్‌ రైలు ప్రారంభంకానున్నది. ప్రతి రోజు ఉదయం 6.55 గంటలకు పాట్నా జంక్షన్‌ నుంచి వందే భారత్‌ రైలు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీకి చేరుతుంది. జెహనాబాద్‌, గయ, కోడెర్మా, బర్కాఖానా, హజారీబాగ్‌, మెస్రా స్టేషన్లలో ఆగుతుంది. గయ స్టేషన్‌లో పది నిమిషాల పాటు ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు ఆరుగంటల్లో రైలు రాంచీకి చేరుతుంది.

ముంబయి – గోవా : వాస్తవానికి ముంబయి – గోవా మార్గంలో ఇప్పటికే రైలు పట్టాలెక్కాల్సి ఉంది. అంతకు ముందు రోజే ఒడిశా బాలాసోర్‌ జిల్లాలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘోర దుర్ఘన నేపథ్యంలో వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ నుంచి రైలు బయలుదేరుతుంది. దాదర్‌, థానే, పన్వెల్‌, రోహా, ఖేడ్‌, రత్నగిరి, కంకావళి, థివిమ్‌ల స్టేషన్లలో ఆగనున్నది.

బెంగళూరు – హుబ్బలి : కొత్తగా బెంగళూరు – హుబ్బళి మధ్య కొత్తగా వందే భారత్‌ రైలు ప్రారంభం కానున్నది. బెంగళూరుకు ఇది రెండో సెమీ హైస్పీడ్‌ రైలు. ఇప్పటికే మైసూర్‌ – చెన్నై రూట్‌లో పరుగులు తీస్తున్నది. మంగళవారం నుంచి మరో రైలు క్రాంతివీర సంగోళి రాయన్న బెంగళూరు సెంట్రల్ స్టేషన్ నుంచి హుబ్బలికి వెళ్తుంది. గదగ్‌, ధర్వాడ మీదుగా హుబ్బలి చేరుతుంది. 490 కిలోమీటర్లు 6.13 గంటల్లోనే చేరుతుంది. రైలు బెంగళూరు నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి.. 11.58 గంటలకు ధార్వాడ్‌ రైల్వేస్టేషన్‌ చేరుతుంది.

భోపాల్- జబల్‌పూర్, భోపాల్‌ – ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌లో ప్రధాని రెండు వందేభారత్‌ రైళ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందులో భోపాల్‌ – జబల్‌పూర్‌ రూట్‌ ఒకటి. జబల్‌పూర్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి.. 10.35 గంటలకు భోపాల్‌ రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. నర్సింగ్‌పూర్‌, పిపారియా, ఇటార్సీ, నర్మదాపూర్ స్టేషన్లలో ఆగుతుంది. రెండో రైలు భోపాల్‌ – ఇండోర్‌ మార్గంలో నడవనున్నది.