ప్రధానిది బెదిరింపు ఉపన్యాసం: చెరుపల్లి సీతారాములు
విధాత: ప్రధాని మోడీ పర్యటనలో చేసిన ఉపన్యాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను బెదిరించేలా ఉందని, అయితే తెలంగాణ గడ్డ వీర తెలంగాణ సాయుధ పోరాట వారసుల గడ్డ అని ఇలాంటి భయాందోళన ఉపన్యాసాలకు తెలంగాణ ప్రజలు భయపడరని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన ఆదివారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు వచ్చిన […]

విధాత: ప్రధాని మోడీ పర్యటనలో చేసిన ఉపన్యాసం రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను బెదిరించేలా ఉందని, అయితే తెలంగాణ గడ్డ వీర తెలంగాణ సాయుధ పోరాట వారసుల గడ్డ అని ఇలాంటి భయాందోళన ఉపన్యాసాలకు తెలంగాణ ప్రజలు భయపడరని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మండిపడ్డారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన ఆదివారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణకు వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్ర అభివృద్ధి కోసం గానీ విభజన సమస్యల పరిష్కారం కోసం గానీ ఉపన్యాసంలో ఎక్కడ కూడా మాట్లాడలేదు. బెదిరింపు ఉపన్యాసం లాగా ప్రధాని మోడీ మాట్లాడడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖండించాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జైలు పాలైన వ్యక్తులను బీజేపీ సమర్థించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ ఇతర రాష్ట్రాలలో చేస్తున్న కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలను కొనుగోలు ద్వారా పడగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని, గవర్నర్లను తాబేదారులుగా వాడుతున్నారన్నారు. గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని గతంలోనే కమ్యూనిస్టులమంతా చెప్పామని గుర్తుచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నలుగురు వ్యక్తుల చేతిలో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం సంక్షోభంలోకి నెట్టాలని బీజేపీ చూస్తుందన్నారు.
బీజేపీ చర్యల వల్లే ధరలు, నిరుద్యోగం పెరగడంతో పాటు మతోన్మాదాన్ని మరింత పెంచి పోషిస్తున్నదని మండిపడ్డారు. మూఢవిశ్వాసాలను, ఆర్ఎస్ఎస్‌ను బీజేపీ ప్రభుత్వమే పెంచి పోషిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం విజ్ఞప్తి చేస్తుందన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు అలాంటి ప్రతిభనే చూపించి తెలంగాణ గడ్డ మీద బీజేపీ ఆటలు సాగవని నిరూపించారన్నారు. జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ బీజేపీ పెంచి పోషిస్తున్న మతోన్మాదాన్ని, మూఢవిశ్వాసాలను జిల్లా వ్యాప్తంగా ఎప్పటికప్పుడు నిలువరిస్తూ బీజేపీ ఆటలను కట్టడి చేస్తామన్నారు.
సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, మద్దెల రాజయ్య, ఎండి పాషా, జెల్లల పెంటయ్య, బూర్గు కృష్ణా రెడ్డి, బొడ్డుపల్లి వెంకటేష్, గుండు వెంకటనర్సు, గంగదేవి సైదులు, బండారు నర్సింహ, దొడ యాదిరెడ్డి, గడ్డం వెంకటేష్, ఎంఏ ఇక్బాల్, వనం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.