ప్రధాని పర్యటన.. CPI కూనంనేని అరెస్ట్
తీవ్రంగా ఖండించిన నారాయణ విధాత: ప‌్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావుతో పాటు పలువురు నాయకులను శనివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ మోడీ గో బ్యాక్ అంటూ రామగుండం బంద్‌కు పిలుపు ఇచ్చారు. దీంతో ప్రధాని పర్యటనను ఎక్కడ అడ్డకుంటారోనని భావించిన పోలీసులు ముందస్తుగా కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టుకు నిరసనంగా కూనంనేనితో పాటు పలువురు నాయకులు రామగుండం పోలీస్టేషన్‌లో […]

తీవ్రంగా ఖండించిన నారాయణ
విధాత: ప‌్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంభశివరావుతో పాటు పలువురు నాయకులను శనివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ మోడీ గో బ్యాక్ అంటూ రామగుండం బంద్‌కు పిలుపు ఇచ్చారు.
దీంతో ప్రధాని పర్యటనను ఎక్కడ అడ్డకుంటారోనని భావించిన పోలీసులు ముందస్తుగా కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేశారు. పోలీసుల అరెస్టుకు నిరసనంగా కూనంనేనితో పాటు పలువురు నాయకులు రామగుండం పోలీస్టేషన్‌లో నిరసనదీక్ష చేస్తున్నారు.
ఇదే తీరుగా ఏపీలోని విశాఖలో ప్రధాని పర్యటనకు నిరసనగా ఆందోళన చేపట్టిన సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలను శుక్రవారం నాడే అరెస్టు చేశారు. తెలంగాణ, ఏపీలో విభజన చట్టాలలోని అంశాలను అమలు చేయాలని శాంతియుతంగా ప్రజాస్వామిక పద్దతుల్లలో ఆందోళన చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను అరెస్టు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండించింది.
నిజాం రాచరిక పరిపాలనను మరిపించే పద్దతుల్లో మోడీ రెండు రాష్ట్రాల పర్యటన ప్రతిబింభిస్తున్నదని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. సింగరేణి, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయకూడదని, సింగరేణి సంస్థను దశల వారీగా ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం కూడ నేరమేనా అని నారాయణ ప్రశ్నించారు.