Seethakka| మంత్రి సీత‌క్క కాన్వాయి త‌నిఖీ

Seethakka| మంత్రి సీత‌క్క కాన్వాయి త‌నిఖీ

విధాత‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధిః పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో రాష్ట్ర‌ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క వాహనం, ఆమె కాన్వాయినీ పోలీసులు తనిఖీ చేశారు. మహబూబాబాద్ జిల్లా ములుగు నియోజక వర్గం కొత్త గూడ మండలంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి ములుగు వస్తున్న క్రమములో మల్లం పల్లి చెక్ పోస్ట్ వద్ద పోలీసులు మంత్రి వాహ‌నాన్ని, కాన్వాయ్ లోని వాహ‌నాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఎన్నిక‌ల సాధార‌ణ నిబంధ‌న‌లు, విధుల్లో భాగంగా ఈ త‌నిఖీలు చేప‌ట్టారు.