రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం
విధాత: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్న ఆ పార్టీ అధిష్ఠానానికి రాజస్థాన్ రాజకీయాలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అశోక్ గెహ్లాట్ ఒకవేళ అధ్యక్షుడైతే సీఎం సీటు వదుకోవాల్సి వస్తుంది. అయితే గెహ్లాట్ అధ్యక్షుడైనా రెండు పదవులను సమర్థవంగా నిర్వహించగలరని ఆయన మద్దతుదారులు చెబుతున్నా రాహుల్ గాంధీ ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న పిలుపు మేరకు ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అదే జరిగితే సచిన్ […]

విధాత: భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపుతున్న ఆ పార్టీ అధిష్ఠానానికి రాజస్థాన్ రాజకీయాలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న అశోక్ గెహ్లాట్ ఒకవేళ అధ్యక్షుడైతే సీఎం సీటు వదుకోవాల్సి వస్తుంది. అయితే గెహ్లాట్ అధ్యక్షుడైనా రెండు పదవులను సమర్థవంగా నిర్వహించగలరని ఆయన మద్దతుదారులు చెబుతున్నా రాహుల్ గాంధీ ఒకే వ్యక్తికి ఒకే పదవి అన్న పిలుపు మేరకు ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
అదే జరిగితే సచిన్ పైలట్ తదుపరి సీఎం అవుతారని ప్రచారం జరుగుతుండటం గెహ్లాట్ వర్గానికి మింగుడు పడటం లేదు. అంతేకాదు సుమారు 90 మంది గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమని అధిష్ఠానికి అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఈ వివాదం సద్దుమణిగేలా అధిష్టాన పరిశీలకులుగా ఉన్న సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, అజయ్ మాకెన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.