సినిమా అవ‌కాశాలు లేవు.. క్రికెట‌ర్‌తో పెళ్లికి పూజా హెగ్డే సిద్ధ‌మైందా?

  • By: sn    latest    Sep 25, 2023 2:27 PM IST
సినిమా అవ‌కాశాలు లేవు.. క్రికెట‌ర్‌తో పెళ్లికి పూజా హెగ్డే సిద్ధ‌మైందా?

సినిమా అవ‌కాశాలు లేవు.. క్రికెట‌ర్‌తో పూజా హెగ్డే పెళ్లికి సిద్ధ‌మైందా?దీపం ఉన్న‌ప్పుడు ఇల్లు చ‌క్క‌బెట్టుకోవ‌డం, కెరీర్ కాస్త డ‌ల్ అయిన‌ప్పుడు అందాల ముద్దుగుమ్మ‌లు పెళ్లి పీట‌లు ఎక్క‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ మ‌ధ్య‌కాలంలో కొంద‌రు భామ‌లు పెళ్లి పీట‌లెక్క‌గా, మ‌రి కొంద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్టు తెలియ‌జేశారు. వారి వివాహం కూడా త్వ‌రలోనే జ‌ర‌గ‌నుంది. అయితే బుట్ట‌బొమ్మ‌గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే కూడా ఇప్పుడు పెళ్లికి సిద్ధంగా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. స్టార్ హీరోల చిత్రాల‌లో వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ త‌న జోరు కొన‌సాగించింది.అయితే ఇటీవ‌లి కాలంలో పూజాకి చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌డి కూడా ప‌డ‌లేదు. చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించ‌గా, ఈ మూవీ కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. బాలీవుడ్‌లో ప‌లు చిత్రాలు చేసిన పూజా హెగ్డే ఒక్క హిట్ కూడా అందుకోలేదు.

అయితే పూజాకి అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్న నేప‌థ్యంలో పెళ్లిపై ఆస‌క్తి చూపుతుంద‌నే టాక్ ఒక‌టి న‌డుస్తుంది. బాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లకి లవ్ ఎఫైర్స్ కి సంబంధించి అనేక ఎఫైర్స్ వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డే గురించి ఒక షాకింగ్ రూమర్ వైరల్ అవుతోంది.అదేంటంటే పూజా హెగ్డే ఓ స్టార్ క్రికెటర్ తో ప్రేమలో ఉందని, త్వరలో వీరిద్దరూ వివాహానికి కూడా రెడీగా ఉన్నార‌ని ఓ వార్త బీటౌన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మ‌రి ఇంత‌కు ఆ క్రికెట‌ర్ ఎవ‌ర‌నేది అందరిలో సందేహం ఉంది. ఆ క్రికెటర్‌తో క‌లిసి పూజా హెగ్డే ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో కూడా మెరిసింద‌ని అంటున్నారు.

 Pooja hegde ready to marry cricketerమరి ఈ రూమర్ లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే స్వయంగా పూజా హెగ్డే క్లారిటీ ఇవ్వ‌క త‌ప్ప‌దు. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకోగా, అనుకోని కార‌ణాల వ‌ల‌న త‌ప్పుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మైమ‌ర‌చిపోతుంటారు. అప్పుడ‌ప్పుడు బికినీలో కూడా ఈ అందాల ముద్దుగుమ్మ సంద‌డి చేస్తుంటుంది.