Prabhas | ప్ర‌భాస్ ఫేస్ బుక్‌లో విచిత్ర‌మైన పోస్ట్‌లు..ఆయ‌న అకౌంట్ ఏమైన హ్యాక్ అయిందా?

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం హిట్స్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు.బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్, సాహో, ఆదిపురుష్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహం చెందారు. అయితే వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌భాస్ చాలా క‌ష్ట‌ ప‌డుతున్నాడు. ఇప్పుడు స‌లార్, ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలతో త‌మ అభిమానుల‌కి మంచి గిఫ్ట్ అందించాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడు. స‌లార్ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుండ‌గా, […]

  • By: sn    latest    Jul 28, 2023 3:46 AM IST
Prabhas | ప్ర‌భాస్ ఫేస్ బుక్‌లో విచిత్ర‌మైన పోస్ట్‌లు..ఆయ‌న అకౌంట్ ఏమైన హ్యాక్ అయిందా?

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం హిట్స్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు.బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన రాధే శ్యామ్, సాహో, ఆదిపురుష్ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహం చెందారు.

అయితే వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు ప్ర‌భాస్ చాలా క‌ష్ట‌ ప‌డుతున్నాడు. ఇప్పుడు స‌లార్, ప్రాజెక్ట్ కె వంటి చిత్రాలతో త‌మ అభిమానుల‌కి మంచి గిఫ్ట్ అందించాల‌ని ప్ర‌భాస్ భావిస్తున్నాడు. స‌లార్ సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుండ‌గా, ప్రాజెక్ట్ కె చిత్రం వచ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక ప్ర‌భాస్ సోష‌ల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండ‌రు అనే విష‌యం తెలిసిందే. ప్రభాస్‌కి ప్ర‌స్తుతం ఫేస్ బుక్, ఇన్‌స్టా అకౌంట్స్ మాత్ర‌మే ఉన్నాయి. వీటిల‌తో తాను త‌న సినిమా అప్‌డేట్స్ త‌ప్ప ఇత‌ర విష‌యాలు ఏవి కూడా పోస్ట్ చేసిన సంద‌ర్భం లేదు.

అయితే తాజాగా ఆయన ఫేస్ బుక్‌లో అడవుల్లో సైక్లింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన యువకుల దృశ్యాలు, రోడ్డు ప్రమాదాలు, ఫన్నీ మూమెంట్స్ వంటివి క‌నిపించాయి. ఇలా సంబంధం లేని పోస్ట్‌లు ప్ర‌భాస్ అకౌంట్‌లో క‌నిపించే స‌రికి ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి ఏం జ‌రుగుతుందో అర్ధం కావ‌డం లేదు. క‌చ్చితంగా ప్ర‌భాస్ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్‌కి గురైంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

అయితే ఈ విష‌యం గ్ర‌హించిన ప్ర‌భాస్ టీం వెంట‌నే ఆయన ఖాతాను స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించి పునరుద్థరించారు. కాగా, ప్ర‌భాస్ త‌న అభిమానులకు అందుబాటులో ఉండటం కోసం 11 ఏళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఫేస్ బుక్‌లో ప్ర‌భాస్‌ని 24 మిలియన్ల మంది అవుతున్నారు.

ప్ర‌భాస్ మాత్రం త‌న అకౌంట్ నుండి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ రాజమౌళి ఒక్కరినే అనుసరిస్తున్నారు. ఇక ప్ర‌భాస్ కొద్ది రోజుల క్రితం విదేశాల‌కి వెళ్లి రీసెంట్‌గా హైద‌రాబాద్ వ‌చ్చారు. కామికాన్ వేడుక‌ల‌లో కూడా పాల్గొని సంద‌డి చేశారు. ఇక ప్రభాస్ ఇప్పుడు సందీప్‌ రెడ్డి వంగాతో ‘స్పిరిట్‌’, మారుతి దర్శకత్వంలో కూడా సినిమాలు చేస్తున్నారు