Prabhas Project K | ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ టీ షర్ట్ కావాలా..? ఈ లింక్‌పై క్లిక్ చేసి ఉచితంగా మీ సొంతం చేసుకోండి..!
Prabhas Project K | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్‌గా నటించనుండడం మరింత ఆసక్తిని కలిగిస్తున్నది. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానున్నది. ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ చేపట్టాలని మూవీ టీం భావిస్తున్నది. […]

Prabhas Project K | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కే. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీపై భారీగానే అంచనాలున్నాయి. సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్ విలన్‌గా నటించనుండడం మరింత ఆసక్తిని కలిగిస్తున్నది. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానున్నది. ఇప్పటి నుంచే సినిమా ప్రమోషన్స్ చేపట్టాలని మూవీ టీం భావిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 20న శాన్ డియాగో కామిక్ కాన్ 2023 వేడుకల్లో ప్రాజెక్ట్ కే ట్రైలర్‌తో పాటు సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు.
ఇందులో పాల్గొనే ప్రభాస్ అభిమానుల కోసం ‘ప్రాజెక్ట్ కే’ టీష్టర్స్‌ను వైజయంతి మూవిస్ ఉచితంగా అందజేస్తున్నది. ఈ టీ షర్ట్‌ను ఉచితంగా ఎలా అందుకోవాలో చెబుతూ మేకర్స్ అకౌంట్‌లో లింక్‌ను షేర్ చేసింది. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే ఓ విండో ఓపెన్ అవుతుంది. పసుపు రంగంలో ఉండే కంటిన్యూ బటన్.. లేదంటే వైజయంతి మూవీస్ లోగోపై క్లిక్ చేసి మెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఆ తర్వాత టీ షర్ట్ సైజ్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అయితే, ఫస్ట్ డ్రాప్ పేరుతో శనివారం లింక్ విడుదల చేయగా నాలుగు నిమిషాల్లోనే చాలా టీ షర్ట్‌లు బుక్ అయినట్లు సమాచారం. ఆదివారం సైతం సెకండ్ డ్రాప్ రిలీజ్ చేయనున్నారు.
Brace yourselves, First Drop ‘The Force’ is getting ready for dispatch.
Get ready for the next drop.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!Stay Tuned