Pre Wedding Photo Shoot | రేయ్ ఎవర్రా మీరంతా..! మురికి కాలువలో ఫొటోషూట్..! నెట్టింట వైరల్..!
Pre wedding photo shoot | విధాత: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలని, జీవితాంతం గుర్తుండిపోవాలని భావిస్తుంటారు. ఈ మేరకు తమ అభిరుచికి తగ్గట్లుగా పెళ్లికి ప్లాన్ చేసుకుంటుంటారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌తో పాటు సాంగ్ షూటింగ్స్‌కు ఇటీవల భారీగా క్రేజ్ పెరిగింది. పెళ్లి చేసుకోబోయే ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడడం […]

Pre wedding photo shoot |
విధాత: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన జ్ఞాపకం. ఈ ఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఉండాలని, జీవితాంతం గుర్తుండిపోవాలని భావిస్తుంటారు. ఈ మేరకు తమ అభిరుచికి తగ్గట్లుగా పెళ్లికి ప్లాన్ చేసుకుంటుంటారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌తో పాటు సాంగ్ షూటింగ్స్‌కు ఇటీవల భారీగా క్రేజ్ పెరిగింది.
పెళ్లి చేసుకోబోయే ప్రీ వెడ్డింగ్ షూట్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. ఇందు కోసం ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లను నియమించుకుంటుండగా.. యువతీ యువకులతో వారు ప్రయోగాలు చేయిస్తున్నారు. ప్రస్తుతం ఓ ప్రీ వెడ్డింగ్ షూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దాన్ని చూసిన వారంతా ఎవర్రా మీరంతా..! అనడం మీవంతవుతుంది..!
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండింగ్‌గా మారింది. ఇటీవల విచిత్రమైన ఫొటోషూట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. హాఫ్ నేక్డ్ ఫోటో షూట్, పంట పొలాలో, నీటిలో, గ్రామీణ నేపథ్యం, రక్తపు మరకల్లో చిత్రచిత్రమైన ఫొటోషూట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఫొటో షూట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకు ముందు ఫిలిప్పీన్స్‌కు చెందిన జంట పొలంలో ఫొటో షూట్ చేయగా వైరల్‌గా మారింది. పిలిప్పీన్స్‌లో రెండు వ్యవసాయ కుటుంబాలకు చెందిన జంట.. ముఖానికి బురద రాసుకొని.. పొలంలో పొటోషూట్ తీసుకున్నారు.
ఈ జంట మాత్రం ఓ అడుగు ముందుకేసింది. చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన మురికి నీటిలో షొటోషూట్ తీసుకోగా నెట్టింట తెగ వైరల్ అవుతున్నది. అయితే ఈ జంట ఎవరు..? ఎక్కడ ఫొటోషూట్ చేశారన్న వివరాలు తెలియరాలేదు. అయితే, నెట్టింట్ల ఫొటోషూట్లపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ కళ్లతో ఏం చూడాల్సి వస్తోంది? అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ వైవాహిక జీవితం మురికి గుంటలా ఉండకూడదంటూ కామెంట్ చేశాడు.