JOBS: డిసెంబర్‌.. ఉద్యోగ ప్రకటనల మాసం

విధాత‌: డిసెంబర్‌ నెల ఉద్యోగ ప్రకటనల కాలం కానున్నదా? అంటే ఆయా నియామక బోర్డుల ఉన్నతాధికారులు అవుననే అంటున్నారు. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన, ఇటీవల కాలంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నియామకాలకు సంబంధించిన ప్రకటనలకు వీలుగా నియామక బోర్డులు నిత్యం సమావేశమౌతూ.. భారీ నోటిఫికేషన్లకు సిద్ధమౌతున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేన్లు వెలువరించడానికి నియామక బోర్డులు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. […]

  • By: krs    latest    Nov 29, 2022 8:22 AM IST
JOBS: డిసెంబర్‌.. ఉద్యోగ ప్రకటనల మాసం

విధాత‌: డిసెంబర్‌ నెల ఉద్యోగ ప్రకటనల కాలం కానున్నదా? అంటే ఆయా నియామక బోర్డుల ఉన్నతాధికారులు అవుననే అంటున్నారు. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన, ఇటీవల కాలంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నియామకాలకు సంబంధించిన ప్రకటనలకు వీలుగా నియామక బోర్డులు నిత్యం సమావేశమౌతూ.. భారీ నోటిఫికేషన్లకు సిద్ధమౌతున్నాయి.

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేన్లు వెలువరించడానికి నియామక బోర్డులు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎక్కువ మంది నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న కీలకమైన గ్రూప్‌-2,3లతో పాటు అత్యధిక పోస్టులు ఉన్న గురుకుల ఉద్యోగ ప్రకటనలు వెలువరించడానికి సిద్ధమౌతున్నది.

నియామక బోర్డులు సంబంధిత హెచ్‌వోడీలతో సమావేశమవుతున్నారు. ఉద్యోగ ప్రకటనలు జారీ చేయడానికి అనుగుణంగా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నారు. సర్వీస్‌ నిబంధనల్లో మార్పులు ఉంటే సరిచేసుకోవాలని సూచిస్తున్నారు.

గ్రూప్‌ -2,3,4 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో టీఎస్‌పీఎస్సీ రోజూ సమావేశాలు నిర్వహిస్తున్నది. గిరిజన రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో గ్రూప్‌-2,3 పై సర్వీస్‌ కమిషన్‌కు ప్రతిపాదనలు అందినట్టు సమాచారం.

మరోవైపు గురుకుల నియామకంపై సంబంధిత బోర్డు సమావేశానికి సన్నద్ధమౌతున్నది. డిసెంబర్‌ నెలలోగా ఈ ప్రకటన విడుదల చేయడానికి కార్యాచరణ రూపొందించింది. ముందుగా అత్యధిక పోస్టులు ఉన్న టీజీటీ, పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.